Top 5 Bikes 2025 : కుర్రాళ్ల డ్రీమ్ బైకులివే.. 2025లో రూ. 3 లక్షల లోపు టాప్ 5 బైక్‌లు.. పర్ఫార్మెన్స్, మైలేజీ కోసమైన కొనేసుకోవచ్చు..!
Top 5 Bikes 2025 : భారత మార్కెట్లో టాప్ 5లో అద్భుతమైన బైకులు లభ్యమవుతున్నాయి. ధర కూడా రూ. 3 లక్షల లోపే ఉంటాయి.. పర్ఫార్మెన్స్, మైలేజీ, స్టైల్ వంటివి ఇప్పుడు తెలుసుకుందాం..

Top 5 Bikes 2025 : కొత్త బైక్ కొంటున్నారా? ఏది కొనాలో డిసైడ్ కాలేకపోతున్నారా? 2025లో భారత మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 5 బైక్‌లను ఓసారి చూడండి.. ధర విషయానికి వస్తే.. రూ. 3 లక్షల లోపు ఉంటాయి. ఇప్పుడు, కస్టమర్లు కేవలం మైలేజ్ కోసం మాత్రమే కాదు.. పర్ఫార్మెన్స్ పరంగా రోజువారీ రైడ్ కోసం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రీమియం మార్కెట్‌కు మాత్రమే సరిపోయే ఫుల్ లెవల్ బైక్‌లు ఇప్పుడు రూ. 3 లక్షల కన్నా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. 2025లో హైవేల నుంచి సిటీ రైడ్‌ల వరకు పట్టణంలోని కొత్త బైక్‌లపై ఓసారి లుక్కేయండి.. ఇందులో మీకు నచ్చిన బైకు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.

బజాజ్ పల్సర్ NS400Z : ఈ ఏడాదిలో బైకుల విషయానికి వస్తే.. కచ్చితంగా సిటీ రైడర్లకు బెస్ట్ బైక్.. ప్రయాణించే దూరం ఎంతైనా కావొచ్చు. పర్ఫార్మెన్స్, రైడింగ్ ఎండ్‌లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా హైవేలలో ఎక్కువగా ప్రయాణించేవారికి బెస్ట్ బైక్.. అయితే, సిటీలో రోజువారీ ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది. పల్సర్ సిగ్నేచర్ స్ట్రీట్ రోడ్లకు బాగుంటుంది. యువతలో ఈ బైక్ బాగా పాపులర్ అయింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 : రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 అనేది చాలా పాతది. కానీ, ఈ జనరేషన్ రైడర్లకు అద్భుతంగా ఉంటుంది. 450cc ఇంజిన్ కొత్త టెక్నాలజీతో రన్ అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణాలకు బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. బైకింగ్ పొజిషన్ విషయానికొస్తే.. బైక్ సిటీ, హైవే రోడ్లపై కూడా వేగంగా దూసుకెళ్లగలదు. స్టయిల్ పరంగా కూడా యువ రైడర్లను ఆకట్టుకునేలా ఉంటుంది.

హీరో మావ్రిక్ 440 : హీరో మావ్రిక్ 440 బైక్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇంజిన్ చాలా సైలెంట్.. లో ఎండ్ టార్క్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ ప్రయాణాలకు రోజువారీ ప్రయాణాలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

కేటీఎమ్ డ్యూక్ 250 : డ్యూక్ 250-KTM గత వెర్షన్ కన్నా చాలా అప్ గ్రేడ్ వెర్షన్.. 2025లో ఈ కేటీఎం డ్యూక్ 250 వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. వెయిట్ లెస్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌ను హ్యాండిల్ చేయడం చాలా ఈజీ కూడా. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నగర రైడర్లకు అద్భుతంగా స్పోర్ట్స్ బైకులను ఇష్టపడే యువ రైడర్‌లకు అదిరిపోయే రేస్ బైక్.. ఈ సెగ్మెంట్‌లో మైలేజ్ కూడా అద్భుతంగా ఇస్తుంది.

టీవీఎస్ అపాచీ RTR 310 : ఇతర బైకులకు భిన్నంగా స్మార్ట్ ఫీచర్లతో రైడింగ్ మోడ్‌లు కలిగి ఉంది. టెక్నాలజీ, పర్ఫార్మెన్స్ అందించే టీవీఎస్ అపాచీ RTR 310 అద్భుతమైన బైక్ అని చెప్పవచ్చు. సిటీ రోడ్లపైనే కాదు.. హైవేపై కూడా రయ్ మని దూసుకుపోవచ్చు. ఈ బైక్ రేసింగ్ ఫీచర్లు కలిగి ఉంది. 2025లో రూ. 3 లక్షల కన్నా తక్కువ ధరకు లాంచ్ అయిన ఈ బైకుల విషయానికొస్తే.. మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి బైకుల కోసం చూస్తుంటే ఈ లిస్టులో మీకు నచ్చిన ఏదైనా బైకు కొనేసుకోవచ్చు.
