Best AMOLED Phones : ఫోన్లు అంటే ఇలా ఉండాలి బ్రో.. రూ. 20వేల లోపు బెస్ట్ AMOLED డిస్‌ప్లే ఫోన్లు.. ఏది కొంటారో కొనేసుకోండి!
Best AMOLED Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రూ. 20వేల లోపు ధరలో అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లే కలిగిన టాప్ 5 స్మార్ట్ ఫోన్లపై ఓసారి లుక్కేయండి..

Best AMOLED Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. పవర్‌ఫుల్ స్క్రీన్‌లతో 5 స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇందులో నథింగ్ ఫోన్ 3a లైట్, రియల్‌మీ 15T, వివో Y400, ఐక్యూ Z10R, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఉన్నాయి. ఈ ఫోన్లలో రిఫ్రెష్ రేట్‌లతో అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లేలను అందిస్తాయి.

సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం నుంచి మీకు ఇష్టమైన షోలను వీక్షించేందుకు అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం మీ బడ్జెట్ ధరలోనే బ్లాక్, పంచ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు.. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేయడం వంటి ఆకట్టుకునే స్క్రీన్ క్వాలిటీతో అద్భుతమైన 5 అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

నథింగ్ ఫోన్ 3a లైట్ (రూ. 19,892) : నథింగ్ ఫోన్ 3a లైట్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రో చిప్‌సెట్ 33W వైర్డ్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది. రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే. . 50MP + 8MP + 2MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాతో పాటు క్వాలిటీ షాట్‌ల కోసం 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్‌మి 15T (రూ. 19,995) : రియల్‌మి 15T ఫోన్ 6.57-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్స్ చిప్‌సెట్‌తో వస్తుంది. రోజంతా పర్ఫార్మెన్స్ కోసం 60W వైర్డ్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

ఐక్యూ Z10R (రూ. 19,999) : ఐక్యూ Z10R ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ 5700mAh బ్యాటరీ, 44W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP + ఆక్సిలరీ లెన్స్ డ్యూయల్-కెమెరా సెటప్, రోజువారీ ఫోటోలకు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో (రూ. 17,499) : సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ 33W వైర్డ్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 50MP + 50MP + 8MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాతో పాటు అద్భుతమైన ఫొటో క్వాలిటీ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ జీటీ 30 (రూ. 19,999) : ఇన్ఫినిక్స్ జీటీ 30 ఫోన్ 1B కలర్ ఆప్షన్లు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 5500mAh బ్యాటరీతో 45W వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా మంచి ఫొటోగ్రఫీ కోసం 13MP ఫ్రంట్ కెమెరాతో పాటు 64MP + 8MP డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
