Avatar 3: అవతార్ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ డిజాస్టర్.. బ్రేకీవెన్ కూడా కష్టమే.. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar 3). అవతార్ సిరీస్ లో మూడవ భాగంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Avatar 3 movie collections are heading towards disaster.
Avatar 3: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar 3). అవతార్ సిరీస్ లో మూడవ భాగంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. ఇండియాలో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో కేవలం రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేయడం విశేషం. అదే అవతార్ 2 సినిమాకి మొదటి మూడు రోజుల్లో రూ.175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టి భట్టి చూస్తే అర్థం అవుతుంది అవతార్ 3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది.
Riddhi Kumar: ఆరెంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ అందాలు.. రద్దీ కుమార్ గ్లామర్ పిక్స్.. ఫోటోలు
కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అవతార్ 3 కలెక్షన్స్ దారుణంగానే ఉన్నాయి. అవతార్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మొదటి రెండు పార్ట్స్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించాయి. కానీ, అవతార్ 3 మాత్రం కానీసం 1.5 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక డొమెస్టిక్ మార్కెట్ అయినా నార్త్ అమెరికాలో అయితే మరీ దారుణమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇప్పటివరకు అవతార్ 3 అక్కడ కేవలం 88 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అవతార్ 2 తో పోల్చితే 34 శాతం వరకు కలెక్షన్స్ తగ్గాయి అని చెప్తున్నారు. ఒక రకంగా ఇది డిజాస్టర్ రిజల్ట్ అనే చెప్పాలి.
ఓవరాల్ గా చూసుకుంటే అవతార్ 3 సినిమాకు 345 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. గత రెండు పార్టీలతో పోల్చితే ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా కనీసం 2 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టడం కూడా కష్టమే అంటున్నారు. కానీ, అవతార్ 3 సినిమా బ్రేకీవెన్ సాదించాలి అంటే కనీసం 2.5 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ అయినా సాధించాల్సి ఉంటుంది. లేదంటే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కింద పడటం ఖాయం. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ సినిమా ఏదైనా మ్యాజిక్ చేస్తుందా అని.
