Akhanda Raja Yogam: ఏది పట్టుకున్నా బంగారమే, ఇక డబ్బే డబ్బు..! 2026లో ఈ రాశులకి అఖండ రాజయోగం..!

ఈ రాశి వారికి 2026లో 5 నెలల పాటు గురు బలం అద్భుతంగా ఉండబోతోంది.

Akhanda Raja Yogam: ఏది పట్టుకున్నా బంగారమే, ఇక డబ్బే డబ్బు..! 2026లో ఈ రాశులకి అఖండ రాజయోగం..!

Updated On : December 23, 2025 / 1:56 AM IST

Akhanda Raja Yogam: 2026.. ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏంటో, అదృష్టం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న రాశులు ఏంటో తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కొన్ని రాశులకు అఖండ రాజయోగం పట్టబోతోంది. ఇంకొన్ని రాశులకు అదృష్టం కలిసి వచ్చి అదృష్టం అందుకోవడానికి ఆ రాశుల వాళ్లు సిద్ధంగా ఉన్నారు. అఖండ రాజయోగం పట్టబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి తుల రాశి.

దానికి కారణం ఏంటంటే.. తుల రాశి వారికి 2026లో 7 నెలల పాటు గురు బలం ఉంది. ఈ గురుబలం వల్ల ధన పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందాయకంగా ఉంటుంది. అన్ని సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. అలాగే ఏడాది మొత్తం శని బలం అద్భుతంగా ఉంది. శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అనారోగ్యాలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. శత్రు బాధలన్నీ తొలగింపజేసుకుంటారు.

అలాగే తుల రాశి వారికి 11వ స్థానంలో కేతువు సంచారం, 2026 దాదాపు చివరి వరకు (డిసెంబర్ 5 వరకు) ఉంది. దాని వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. అంటే సంవత్సర ఫలితాలు చూసే నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు తుల రాశి వారికి 2026లో అద్భుతంగా యోగిస్తున్నాయి. అందుకే, తుల రాశి వారికి నూతన ఏడాదిలో అఖండ రాజయోగం పట్టబోతోంది.

ఈ రాశి వారికి 2026లో 5 నెలల పాటు గురు బలం..

2026లో అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2026లో 5 నెలల పాటు గురు బలం అద్భుతంగా ఉండబోతోంది. అలాగే వృషభ రాశి వారికి ఏడాది చివర వరకు అంటే డిసెంబర్ 5 వరకు రాహువు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. శని 11వ స్థానంలో లాభ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. రుణ బాధల నుంచి బయటపడతారు. ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వృషభ రాశి వారికి 2026 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నాలుగు ప్రధాన దీర్ఘకాలిక గ్రహాల్లో 3 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి.

సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏయే రాశులకు రాజయోగం పడుతుందో తెలుసుకోవాలంటే ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయో తెలుసుకోవాలి. ప్రధానంగా నాలుగు దీర్ఘకాలిక గ్రహాలలో (గురువు, శని, రాహువు, కేతువు).. ఈ నాలుగు గ్రహాలలో మూడు గ్రహాలు యోగించేటువంటి రాశులు తుల రాశి, వృషభ రాశి. అందుకే, ఈ రెండు రాశుల వారికి 2026లో అఖండ రాజయోగం పట్టబోతోంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

2026లో అదృష్టం పట్టబోతున్న రాశులు..

అఖండ రాజయోగం కాకపోయినప్పటికీ.. 2026లో అదృష్టం పట్టబోతున్న రాశులు కొన్ని ఉన్నాయి. అదృష్టం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న రాశులు కొన్ని ఉన్నాయి. నాలుగు దీర్ఘకాల గ్రహాల్లో.. అంటే రాహువు, కేతువు, గురువు, శని.. వీటిలో రెండు గ్రహాలు యోగించినట్లు అయితే అదృష్టం పడుతుంది. మూడు గ్రహాలు యోగించినట్లైతే అఖండ రాజయోగం పడుతుంది. ఏ రాశులకు అయితే రెండు గ్రహాలు యోగిస్తున్నాయో ఆ రాశులకు అదృష్టం పట్టబోతోంది.

రెండు గ్రహాలు యోగించడం వల్ల అదృష్టం పట్టబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్య రాశి. 2026లో కన్య రాశి వారికి గురు బలం 5 నెలలు ఉంటుంది. కాబట్టి గురువు యోగిస్తున్నాడు. అలాగే సంవత్సరం మొత్తం శని కన్య రాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. గురు బలం ఉంది, శని బలం ఉంది. రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. కాబట్టి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ధనపరంగా, ఉద్యోగ పరంగా, వివాహ పరంగా కలిసొస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. కన్య రాశి వారు అదృష్టాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆ తర్వాత 2026లో అదృష్టం పట్టబోతున్న రాశి.. వృశ్చిక రాశి. దానికి కారణం ఏంటంటే.. 2026 మొత్తం ఈ రాశి వారికి గురు బలం 5 నెలల పాటు ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి 10వ ఇంట్లో కేతువు సంవత్సరం చివర వరకు అంటే డిసెంబర్ 5 వరకు యోగిస్తున్నాడు. కాబట్టి గురు బలం, కేతు బలం ఉండటం వల్ల వృత్తిపరంగా బాగా ఎదుగుతారు. ధన పరంగా బాగా కలిసి వస్తుంది. కన్య రాశితో పాటుగా వృశ్చిక రాశి వారు కూడా అదృష్టాన్ని అందుకోవడానికి 2026 సంవత్సరంలో సిద్ధంగా ఉన్నారు.

భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి..

ఆ తర్వాత 2026 ఏడాదిలో అదృష్టం పట్టబోతున్న మరో రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గురు బలం కాస్త ఎక్కువగానే ఉంది. 2026 మొత్తంలో 7 నెలల పాటు ధనస్సు రాశి వారికి గురు బలం ఉంది. అలాగే దాదాపు సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహు బలం ఉంది. అంటే నాలుగు దీర్ఘకాలక గ్రహాల్లో రెండు గ్రహాలు యోగించటం వల్ల ధనస్సు రాశి వారు కూడా అదృష్టం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాశి వారికి పెళ్లిళ్లు నిశ్చయం అవుతాయి. భార్య, భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి. విదేశీయన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

2026లో అదృష్టం పట్టబోతున్న మరో రాశి మకర రాశి. ఎందుకంటే ఈ రాశి వారికి 2026లో 5 నెలల పాటు గురు బలం ఉంటుంది. గురువు యోగిస్తున్నాడు. అలాగే శని 3వ స్థానంలో సంవత్సరం అంతా ఉన్నాడు. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం ఉంటుంది. దేన్నైనా మకర రాశి వాళ్లు సాధించగలరు. కొండలు పిండి చేసే ఆత్మ విశ్వాసంతో కష్టమైన పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా దేన్నైనా మనో ధైర్యంతో ముందుకు దూసుకెళ్లి విజయం సాధిస్తారు.

శత్రు బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి..

అలాగే 2026లో అదృష్టం పట్టబోతున్న ఆఖరి రాశి మీన రాశి. 4 దీర్ఘకాల గ్రహాల్లో గురు గ్రహం యోగిస్తోంది. గురు గ్రహం 5 నెలల పాటు యోగించడం వల్ల ధన పరంగా కలిసొస్తుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మీన రాశి వాళ్లకి 6వ ఇంట్లో కేతువు సంచారం 2026 డిసెంబర్ 5 వరకు ఉంటుంది. దాని వల్ల భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి. భయంకరమైన రుణ బాధలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు.. వీటన్నింటి నుంచి సులభంగా బయట పడతారు. 2026లో అదృష్టం పట్టబోతున్న రాశులను పరిశీలిస్తే.. కన్య రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, మీన రాశి.. ఈ ఐదు రాశులకు కూడా అదృష్టం పట్టబోతోంది.

2026 మొత్తం కూడా 3 గ్రహాలు అద్భుతంగా యోగించడం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండు రాశులు తుల రాశి, వృషభ రాశి. 4 గ్రహాల్లో 2 గ్రహాలు యోగించడం వల్ల అఖండ రాజయోగం కాకపోయినప్పటికీ అదృష్టం పట్టబోతోంది. అదృష్టం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న 5 రాశులు.. కన్య రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, మీన రాశి. అంటే దాదాపు 7 రాశులకి 2026లో చాలావరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. 2 రాశులకు అఖండ రాజయోగం పడితే, మిగిలిన 5 రాశులకు అదృష్టం పడుతుంది.

అఖండ రాజయోగం అంటే మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అంత అద్భుతంగా ముందుకి దూసుకెళ్తారు. అదృష్టం అంటే చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఏ ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అఖండ రాజయోగం అంటే ఊహించని విధంగా అదృష్టం రావటం. అదృష్టం కలిసి రావటం అంటే చేపట్టిన పనుల్లో ధన లాభం కలిగి విజయం చేకూరడం. 2026 నూతన సంవత్సరంలో 12 రాశుల్లో 7 రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.

Also Read: 2026లో జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వాళ్లు వీరే..! ఎందుకంటే..