Digestion : జీర్ణక్రియను మెరుగుపర్చడం ఎలా? ఇందుకోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే?

బీన్స్, ఆస్పరాగస్ , బ్రోకలీ , మూత్రపిండాల బీన్స్, కాలీఫ్లవర్స్, పుట్టగొడుగులు మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపుబ్బరానికి కారణమవుతాయి. పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగం ప్రమాదాన్ని కలిగి ఉంది కాబట్టి వాటిని అధికమోతాదులో తీసుకోకూడదు.

Digestion : జీర్ణక్రియను మెరుగుపర్చడం ఎలా? ఇందుకోసం తీసుకోకూడని ఆహారాలు ఇవే?

Digestion :

Digestion : ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం అన్నది శరీరం అన్నివేళల్లోనూ నిర్వహించే ప్రాధమిక కర్తవ్యం. ఈ జీర్ణక్రియ మనిషి నిద్రపోతున్న సమయం కంటే మేలుకొని ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. జీర్ణక్రియ అనేది ఆహారాన్ని నమలడం నుండి ప్రారంభమై వ్యర్థాల విసర్జన తో ముగుస్తుంది. మన శరీరం యొక్క పోషక అవసరాలను తీర్చడానికిగాను జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రాథమిక మార్గం జీర్ణ ప్రక్రియను పెంచే ఆహారాలను రోజువారిగా తీసుకోవటం. అయితే వీటిలో కొన్నిరకాల ఆహారాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆహారాలు జీర్ణక్రియలు మందగించటానికి కారణమౌతాయి. అందుచేత వాటిని పరిమితికి మించి తీసుకోకూడదని సూచిస్తున్నారు.

మంచి జీర్ణశక్తికి తీసుకోకూడని ఆహారాలు ఇవే ;

మన జీర్ణక్రియ ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు గురించి చాలా మందికి అవగాహర ఉండదు. మన జీర్ణక్రియకు హాని కల్గించే ఆహారపదార్థాల్ని తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దం…

1 అధిక సోడియం ఉండే ఆహారం ; సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం జీర్ణక్రియ ఆరోగ్యాన్ని నెమ్మదించేలా చేస్తుంది. ఉప్పులో సోడియం ఉంటుంది, కానీ మన తినే ఆహారాల్లో కూడా సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. ప్యాక్ చేసిన ఆహారాలు మరియు ఫాస్ట్ ఫుడ్స్ సోడియంతో నిండి ఉంటాయి. వీటిని తినడం వల్ల సోడియంను అధికంగా పొందడం జరుగుతుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు బాధ్యత వహించే కడుపులోని సహజ మైక్రోఫ్లోరాను మార్చివేస్తుంది. కాబట్టి మన జీర్ణక్రియ మెరుగుపడడానికి ఈ ఆహారాలను తీసుకోకపోవడం మంచిది.

READ ALSO : Sitting Risks : రోజులో అధిక సమయం కూర్చునే ఉంటున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు…

2. అధిక చక్కెర తో కూడిన ఆహారం ; అధిక ఉప్పు ఆహారం వంటిదే అధిక చక్కెరల ఆహారం. ఇది మన పేగు ఆరోగ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. క్యాండీలు, స్వీట్లు, మొదలైనటువంటి పంచదార ఉత్పత్తులను ఎక్కువమోతాదులో తీసుకోవటం వల్ల కడుపులో గ్యాస్ కు కారణమై కడుపుబ్బడం, తేన్పులు రావడం, అపానవాయువు వదలడం వంటి లక్షణాలు కలుగుతాయి. అధికచక్కెరతో కూడిన ఆహారాలు తినడంవల్ల కడుపులో అధిక గ్యాస్ తయారవుతుంది. ఈ ఆహారాలు ఈ వాయువులను విడుదల చేసే ప్రేగుల యొక్క మైక్రోఫ్లోరాను మార్పు చేస్తాయి.

3. ఇతర ఆహారాలు ; బీన్స్, ఆస్పరాగస్ , బ్రోకలీ , మూత్రపిండాల బీన్స్, కాలీఫ్లవర్స్, పుట్టగొడుగులు మరియు ఉల్లిపాయలు వంటి కూరగాయలు కడుపుబ్బరానికి కారణమవుతాయి. పాలు మరియు పాల ఉత్పత్తుల వినియోగం ప్రమాదాన్ని కలిగి ఉంది కాబట్టి వాటిని అధికమోతాదులో తీసుకోకూడదు. మెరుగైన జీర్ణక్రియకు మరియు కడుపుబ్బరాన్ని, అపానవాయువు తగ్గించడానికి కార్బొనేటేడ్ పానీయాల్ని తీసుకోరాదు.

వెన్న, నెయ్యి , క్రీమ్, మొదలైన అధిక కొవ్వు పదార్ధాలు జీర్ణించుకోవటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని తీసుకోకపోవటమే మంచిది. మాంసకృత్తుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొవ్వు తక్కువగా ఉండే లీన్ చికెన్, పప్పులు , పందిమాంసం వంటి తక్కువ కొవ్వు వాటిని ఎంపిక చేసుకోవడం మేలు. అధికంగా అరటిపండ్లను తింటే మలబద్ధకం యొక్క అపాయాన్ని పెంచడమే అవుతుంది. అరటిపండ్లను అధికంగా కూడా తీసుకోరాదు.

జీర్ణశక్తి బాగుండాలంటే ప్యాకేజ్డ్ లేదా ఫాస్ట్ ఫుడ్కు బదులుగా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వంటి సహజ ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోండి. తక్కువ కొవ్వుగల పాల ఉత్పత్తులకు మారండి. రోజువారీ జీవనశైలిలో శ్రమతో కూడిన శారీరక వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా అలవర్చుకోండి. జీర్ణ ప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది కాబట్టి మింగడానికి ముందు ఆహారాన్ని బాగా నమలాలి.