Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

చిన్నవయస్సులో టీ అలవాటు చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వారి ఎదుగుదలపై ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. అనేక సైడెఫెక్ట్స్ ఉత్పన్నమౌతాయి.

Tea : పిల్లలు టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?

Tea

Tea : నిద్రలేవగానే టీ తాగటం చాలా మందికి అలవాటు. అదే అలవాటును ఇంట్లోని తమ చిన్న పిల్లలకు నేర్పిస్తారు. అయితే చిన్న పిల్లలు ప్రతిరోజు టీ తాగటం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ వారి ఆరోగ్యానికి దుష్పప్రభావాలు కలిగిస్తాయి. ప్రతిరోజు పిల్లలు వీటిని సేవించటం వల్ల వారిలో నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్న మౌతాయి. టీ తాగేచిన్నారుల్లో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన నిద్ర లేమి సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి, తల తిరగడం మొదలైన సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా గ్రీన్ టీ వంటి వాటిని 12 ఏళ్ళ లోపు పిల్లలకు అలవాటు చేయకపోవటమే ఉత్తమం. గ్రీన్ టీ ఆకుల్లో పెద్ద మొత్తంలో కెఫిన్, టానిన్, థెయిన్ లు ఉంటాయి. ఇవి చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రక్తంలో హిమో గ్లోబిన్ తగ్గటంతోపాటు, రక్తహీనతకు కారణమౌతుంది. అంతే కాకుండా నాడీ వ్యవస్ధను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. పిల్లలకు అదేపనిగా నిత్యం టీ తాగటం వల్ల ఎసిడిటీకి లోనై గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు అధిక మూత్రవిసర్జనతో సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

చిన్నవయస్సులో టీ అలవాటు చేసుకోవటం వల్ల భవిష్యత్తులో వారి ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అనేక సైడెఫెక్ట్స్ ఉత్పన్నమౌతాయి. ఇటీవలి కాలంలో చాలా మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు. గ్రీన్ టీ తాగటం వల్ల ఊబకాయం నుండి బయటపడవచ్చన్న నిపుణుల సూచనలతో తల్లిదండ్రులు తమ పిల్లలకు గ్రీన్ టీల ను అలవాటు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలు టీ తాగటం వల్ల అజీర్ణం, తలనొప్పి, మొదలైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నికొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, బరువు పెరగడం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థకు దారితీసే ఛాన్స్ ఉంటుంది.