Cold : జలుబుతో బాధపడుతున్నారా!…ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది. గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి.

Cold : జలుబుతో బాధపడుతున్నారా!…ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

Cold

Cold : చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా ప్రతివారూ ఎప్పుడోఒకప్పుడు జలుబుబారిన పడుతుంటారు. సర్వసాధారణమైన జబ్బుల్లో ఇది ఒకటి. ఒక మనిషి ఏడాదికి సగటున రెండు నుండి మూడుసార్లైనా జలుబు బారిన పడుతుంటారని పలు పరిశోధనల్లో తేలింది. జలుబు రావటానికి అనేక వైరస్ లు కారణమని పరిశోధకులు నిర్ధారించారు.

జలుబు చేస్తే తుమ్ములు, ముక్కునుండి నీరు కారటం, జ్వరం రావటం వంటి సమస్యలు వస్తుంటాయి. గాలి అందకపోవటం, ముక్కు బిగేసినట్టు ఉండటం, ఒళ్ళంతా నొప్పులు తదితర లక్షణాలు ఈసమయంలో బయటపడతాయి. వర్షంలో తడవటం వల్లో, చలికాలం వల్లో జలుబు వస్తుందన్నమాట్లలో ఎలాంటి వాస్తవంలేదు.

జలుబుకు మందులు వాడినా, వాడకున్నా వారం రోజుల పాటు జలుబు ప్రభావం మనిషి శరీరంలో ఉంటుంది. జలుబు ఒకరి నుండి మరొకరికి గాలి ద్వారా, జలుబుతో ఉన్న వ్యక్తి తాకిని వస్తువులను తాకటం వల్లో స్పర్శద్వారానో వస్తుంది. జలుబు ఉన్న సమయంలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తగిన విశ్రాంతి తీసుకోవటం అవసరం. జలుబు వల్ల కలిగే నీరసము పోవడానికి మంచి ఆహారము తీసుకోవాలి. వేడి పదార్ధాలు తినాలి. తేలికగా జీర్ణం అయ్యే ఆహారము తీసుకోవాలి. అలిసిపోయే పనులు చేయకూడదు. మత్తుపానీయాలు తీసుకోకూడదు . పొగ తాగకూడదు . ఐస్ క్రీములు , చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.

మాంసాహారము తీసుకొనే వారు ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తీసుకొనుట వలన కాస్త ఉపశమనము వుంటుంది. గోరు వెచ్చని వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీటి ఆవిరి తీసుకోవడం ద్వారా ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. వేడి కాఫీ , తీ , పాలు తీసుకుంటే గోతులో గురగుర తగ్గుతుంది. కొవ్వు పదార్ధాలు, మాంసము, పాల వుత్పత్తులు తక్కువగా తీసుకోవడం ఉత్తమం. జలుబు సోకిన వ్యక్తి ఎంతకాలము బాధ పడతారు అన్నది వారి వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తి పైన,ఆ వైరస్ రకాల పైన ఆధారపడి వుంటుంది.

నడక, జాగింగ్‌, ఈతకొట్టడం, సైకిల్‌ తొక్కడం వంటివి రోజుకు ఒక అరగంట పాటు చేస్తే జలుబు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మంచినీరు, టీ, పళ్ల రసాలు మొదలైన ద్రవ పదార్థాలు పుష్కలంగా లోపలికి తీసుకుంటే మనం జలుబుకు దూరంగా ఉండవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.జలుబు చేసిన మనిషి దగ్గినా, తుమ్మినా మిలియన్ల కొద్దీ వైరస తుంపరలు గాలిలో వ్యాపిస్తాయి. జలుబు చేసిన మనిషి దగ్గుతున్నప్పుడూ, తుమ్ముతున్నప్పుడూ నోటికి చేతిని అడ్డంపెట్టుకోవటం మంచిది.

యాంటిబయాటిక్స్‌ వంటివి బాక్టీరియా వలన వచ్చే ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి తప్ప వైరస్‌ వలన వచ్చే జలుబులాంటి అస్వస్థలకు ఉపయోగపడవు. జలుబుతో బాధపడుతున్నప్పుడు ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్పునీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

పెద్ద గిన్నెలో మరిగించిన నీరు తీసుకుని మధ్యకు కోసిన రెండు ఉల్లిపాయ మక్కలు వేయండి. ఈ నీళ్లతో కనీసం పదిహేను నిమిషాలు ఆవిరిపట్టండి. జలుబుతో మూసుకుపోయిన ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. జలుబు ఉన్నా లేకపోయినా సరే.. వారానికోసారి యూకలిప్టస్‌ నూనె వేసిన నీటితో ఆవిరిపట్టండి. దీనివల్ల శ్వాససంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.