Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?…

పాదాల వాపులను తగ్గించటంలో ధనియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే పాదాల వాపును సులభంగా తగ్గించవచ్చు.

Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?…

Leg Swelling

Feet Swelling : పాదాలు వాచిపోవటాన్ని చాలా మందిలో గమనిస్తుంటాం. అలా ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎక్కవ సేపు కోర్చోవటం వల్ల పాదాలు వాసిపోతున్నాయని కొందరు భావిస్తుంటారు. అయితే పాదాల వాపులను అంత తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే పాదాల వాపులు కూడా శరీరంలో వచ్చే కొన్ని రకాల అనోరోగ్య సమస్యలకు సంకేతాలుగా భావించాలి. పాదాల వాపు అనేది గర్భధారణ సమయంలో స్త్రీలలో కనిపించటం సాధారణం. అలాగే ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు ఇలాగే జరుగుతుంది.

ఇవేవి కాకుండా పదేపదే కాళ్ళు ఉబ్బిపోయి కనిపిస్తుంటే మాత్రం భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందన్న విషయం గ్రహించాలి. గుండె, కిడ్నీల పనితీరు సరిగా లేకున్నా, రక్తపోటులో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా పాదాల వాపు కనిపిస్తుంది. వాపు కనిపించిన వెంటనే గుండెకు, కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని వాటి పనితీరును నిర్ధారించుకోవాలి. పాదాల వాపు శరీరంలో లవణాలు అధికంగా చేరటం వల్ల వస్తుంది. శరీరంలో ఉన్న లవణాలను పలుచన చేసేందుకు నీటిని ఎక్కుగా తీసుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. పాదాల్లో ఉన్న నీరును తొలగించుకునేందుకు కొన్ని రకాల చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటంటే…

తరచు బార్లీ నీరు తాగుతుండటం వల్ల కూడా పాదాల వాపు రాకుండా ఉంటుంది. పాదాల వాపులను తగ్గించడంలో గ్రేప్‌ ఫ్రూట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ బాగా పనిచేస్తుంది. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల గ్రేప్‌ ఫ్రూట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వేసి ఆ నీటిలో పాదాలను ఉంచాలి. ఒక గ్లాస్‌ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. కీర దోస జ్యూస్‌ను కూడా తాగవచ్చు. దీని వల్ల పాదాల వాపులు తగ్గుతాయి. పాదాల్లో అధికంగా ఉండే ద్రవాలు బయటకు పోతాయి.

పాదాల వాపులను తగ్గించటంలో ధనియాలు బాగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే పాదాల వాపును సులభంగా తగ్గించవచ్చు.  3 టీస్పూన్ల ధనియాల విత్తనాలను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగం కప్పు అయ్యే వరకు మరిగించాక ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే పాదాల వాపు సమస్య తొలగిపోతుంది. పుచ్చకాయలను తినడం వల్ల మూత్రం బాగా వస్తుంది. తద్వారా శరీరంలో ఉండే అధిక ద్రవాలతోపాటు వ్యర్థాలు బయటకు పోతాయి. పాదాల వాపులు తగ్గుతాయి.

నువ్వుల నూనెతో రోజూ పాదాలను 10 నిమిషాల పాటు మర్దన చేసి గోరు వెచ్చని నీటితో కాపడం పెట్టాలి. ఇలా రోజూ చేస్తే పాదాలలో రక్త సరఫరా పెరుగుతుంది. వాపులు తొలగిపోతాయి. అలాగే నిద్రించేటప్పుడు పాదాలను ఎత్తులో పెట్టుకుని నిద్రించాలి. అందుకు గాను దిండును ఉపయోగించాలి. పాదాలు గుండె కన్నా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఇక ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. కూరల్లో ఉప్పు తగ్గించుకోవాలి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటం లేదా నిలుచుని ఉండటం చేయకూడదు. మధ్య మధ్యలో విరామం తీసుకుని కాస్తంత దూరం నడవాలి. రక్త సరఫరా మెరుగు పడేందుకు పాదాలకు వ్యాయామం చేయాలి. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి.