Gallstones : పిత్తాశయంలో రాళ్ల సమస్యకు కారణాలు ఇవే!

మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలను మితంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాల వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. దీని వల్ల పైత్యరసం కొలెస్ట్రాల్ ద్రవ రూపంలో ఉండేలా చూస్తుంది. తద్వారా రాళ్లు ఏర్పడవు.

Gallstones : పిత్తాశయంలో రాళ్ల సమస్యకు కారణాలు ఇవే!

Gallstones : పిత్తాశయంలో రాళ్ల సమస్య చాలా మందిని వేధిస్తుంది. వాస్తవానికి అసలు సమస్యకు కారణం ఏంటన్న విషయం చాలా మందిలో అవగాహన ఉండదు. మనం రోజు వారి తీసుకునే ఆహారం, అలవాట్లు ముఖ్యంగా ఈ గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తాయి. ఊబకాయం, అధిక బరువు సైతం ఇందు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయంలో రాళ్ల సమస్య తలెత్త కుండా ఉండేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలను మితంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిరు ధాన్యాల వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. దీని వల్ల పైత్యరసం కొలెస్ట్రాల్ ద్రవ రూపంలో ఉండేలా చూస్తుంది. తద్వారా రాళ్లు ఏర్పడవు. శారీరక శ్రమ లేని వారిలో ఈ రాళ్ల సమస్య అధికంగా ఉంటుంది. రోజు వారి వ్యాయామాలు చేయక పోవటం వల్ల జీర్ణక్రియలు మందగించి పైత్యరసం విడుదల కాదు. దీంతో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. అందుకే రోజు వారిగా వ్యాయామాలు అలవాటుగా చేసుకోవాలి.

సోయాబీన్స్, గుడ్లు, ఓట్స్, పాలు, వేరుశనగలు, క్యాబేజీ వంటి ఆహారాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవటం వల్ల వీటిలో ఉండే లెసితిన్ అనే పదార్ధం పిత్తా శయంలో కొలెస్ట్రాల్ గట్టిపడకుండా చేస్తుంది. అదే క్రమంలో పిత్తా శయంలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు ఆలివ్ నూనె బాగా తోడ్పడుతుందని అధ్యయనాల ద్వారా తేలింది. ఆలివ్ నూనె వాడే వారిలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అన్నది తక్కువని పరిశోధనల ద్వారా నిర్ధారించారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సమాచారం సేకరించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.