Teeth Shine White : పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మెరిసిపోయేలా చేయాలంటే!

ఫ్లాసింగ్ చేయడం వల్ల దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది. జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడటానికి పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది.

Teeth Shine White : పసుపు రంగులోకి మారిన దంతాలను తెల్లగా మెరిసిపోయేలా చేయాలంటే!

yellow teeth shine white

Teeth Shine White : అందమైన నవ్వుకు తెల్లని దంతాలు మరింత వన్నెతెస్తాయి. దంతాలు తెల్లగా మెరుస్తుండాలని చాలా మంది కోరుకుంటారు. మెరిసే దంతాలను సొంతం చేసుకునేందుకు రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయటంతోపాటు కొన్ని టిప్స్ ను అనుసరించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలా మందిలో దంతాలు పసుపు వర్ణంలో ఉంటాయి. పసుపు వర్ణం నుండి తెలుపు వర్ణంలోకి మార్చేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

దంతాలు తెల్లగా మారాలంటే ;

కాఫీ, సోడా మరియు కొన్ని సార్లు మౌత్ వాష్ లు కూడా మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండాలి. కనీసం రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా చేయటం వల్ల దంతాలు, నాలుక మీద అతుకొన్ని ఉన్న బ్యాక్టీరియాను తొలగిపోతుంది. దంతాలపై ఉండే మరకలు పోతాయి. సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి మీ దంతాలను బలోపేతం చేస్తాయి. ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఫ్లాసింగ్ చేయడం వల్ల దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది. జున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడటానికి పళ్ళు మీదు ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది. కలర్ డ్రింక్ త్రాగుతున్నప్పుడు , దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి స్ట్రాను ఉపయోగించాలి. నిమ్మ , ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించి రెగ్యులర్ గా బ్రష్ చేయాలి. నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది. ఈ కూరగాయలరు పచ్చిగా తినడం వల్ల పళ్ల మద్య సహజంగానే మాసాజ్ చేస్తాయి దాంతో పళ్ళ మద్య శుభ్రం అవుతుంది. దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడతాయి. రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చాలి. ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి. దాంతో దంతాలపైన ఎనామిల్ పాడవుతుంది. మింట్ టూత్ పేస్టును ఉపయోగించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుదీనాతోతయారుచేసిన టూత్ పేస్ట్ దంతాలను తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.