Women Cancers : మహిళలు ఈ క్యాన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే!

చిన్నతనంలో పెళ్లి చేసుకుని, లైంగికచర్య ప్రారంభించడం, లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లూ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువ రోజులు గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి.

Women Cancers : మహిళలు ఈ క్యాన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే!

Women cancers

Women Cancers : మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఏమాత్రం తగదు. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. రెగ్యులర్ బ్లడ్ చెక్-అప్‌లు ఏవైనా సమస్యలు తలెత్తడానికి ముందే గుర్తించడంలో సహాయపడతాయి. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి మార్పుల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా సందర్భాల్లో వీటిని గుర్తించలేని పరిస్ధితి. తమకు ఎలాంటి అనారోగ్యం లేదన్న భావనలో చాలా మంది మహిళలు ఉంటారు. చివరకు చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ప్రస్తుతం మహిళలను కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. దీని విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఏప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు వచ్చే క్యాన్సర్ల విషయంపై సరైన అవగాహన కలిగి ఉండటం అవసరం.

మహిళలకు సాధారణంగా వచ్చే క్యాన్సర్లు ;

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: చిన్నతనంలో పెళ్లి చేసుకుని, లైంగికచర్య ప్రారంభించడం, లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లూ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువ రోజులు గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి. కలయిక సమయంలో పురుషులు కండోమ్‌లు, స్త్రీలు డయాఫ్రమ్‌లు వాడాలి. విటమిన్‌ సి లోపించకుండా చూసుకోవాలి. పోషక విలువలున్న జామ, ఉసిరి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

రొమ్ము క్యాన్సర్‌: అధికబరువూ, పుట్టిన వారికి తల్లిపాలు ఇవ్వలేకపోవడం, పిల్లలు కలగకపోవడం, దీర్ఘకాలికంగా హార్మోన్లు వాడటం. కుటుంబంలో ఈ సమస్య ఉండటం దీనికి ప్రధాన కారణాలు. అందుకే తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలి. హార్మోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌: స్థూలకాయం, మధుమేహం, ఈస్ట్రోజెన్‌ హార్మోను శరీరంలోనే ఎక్కువగా ఉండటం లేదా మాత్రల రూపంలో తీసుకోవడం, పీసీఓఎస్‌ పాలీసిస్టీక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌, వంశపారంపర్యంగా రావడం, పిల్లలు లేకపోవడం వంటివి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎక్కువకాలం ఈస్ట్రోజెన్‌ వాడకపోవడం, పీసీఓఎస్‌ ఉన్నవాళ్లు ప్రొజెస్టెరాన్‌ని మాత్రలు లేదా మెరీనా లూప్‌లా వాడటం వల్ల ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

అండాశయ క్యాన్సర్‌: అధిక బరువూ, కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. ముందు బరువు తగ్గాలి. అయితే గర్భనిరోధక మాత్రలు వాడేవారికీ, పాలిచ్చే తల్లులకూ, కుటుంబనియంత్రణ కోసం ట్యూబెక్టమీ చేయించుకునేవారికీ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

చర్మ క్యాన్సర్ ; చర్మం యొక్క ఉపరితలంపై చర్మ క్యాన్సర్ వస్తుంది. చర్మ రంగును ఉత్పత్తి చేసే ప్రత్యేక కణాలలో క్యాన్సర్ కణం మొదలవుతుంది. కణాల అసాధారణ పెరుగుదల తరచుగా తల, ముఖం, పెదవులు, చెవులు, మెడ, ఛాతీ, చేతులు,కాళ్ల పై పొలుసులు ఏర్పడటం, నల్లగా కమిలిపోవటం వంటివి గమనిస్తే తక్షణం తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ; గతంతో పోలిస్తే, మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయం పెరుగుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తుల కణజాలాలలో అనియంత్రిత కణాల పెరుగుదల. ఇటువంటి కణాల పెరుగుదల ఊపిరితిత్తులు కాకుండా సమీప కణాలపై దాడి చేస్తుంది, ఇది శరీరమంతా క్యాన్సర్ వ్యాప్తి చెందుతుంది.