Ramayanam : 25 సంవత్సరాల రామాయణం.. బాల నటుడిగా తారకరాముని ప్రభంజనం..

ఎన్టీఆర్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడే 'రామాయణం' సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. పూర్తిగా పిల్లలతోనే తెరకెక్కిన ఈ రామాయణం సినిమా బాల రామాయణంగా బాగా ప్రసిద్ధి చెందింది.

Ramayanam : 25 సంవత్సరాల రామాయణం.. బాల నటుడిగా తారకరాముని ప్రభంజనం..

Ramayanam

 

NTR :  రామాయణం.. ఈ పేరు మనం రోజు వింటూనే ఉంటాం. ఈ ఇతిహాసాన్ని కళ్ళకి కట్టినట్టు ఎన్నో సినిమాలు చూపించాయి. గతంలో సీనియర్ ఎన్టీఆర్ రామాయణం స్ఫూర్తిగా ఎన్నో సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో అప్పటి నటీనటులంతా పాలుపంచుకున్నారు. రామాయణం అంటే ఇదేనా అన్నట్టు చూపించారు. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలకు అలవాటు పడి రామాయణ,మహాభారతల్ని పక్కనపెట్టేశారు. అందులోని సారాంశాన్ని తీసుకొని సినిమాలు చేసినా ఆ చరిత్రతో మాత్రం సినిమాలు తీయలేదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ రామాయణాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

ఇప్పుడు దేశమంతా జూనియర్ ఎన్టీఆర్ నటనని ప్రశంసిస్తున్నారు కానీ 25 సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ బాల నటుడిగా తన నట ప్రభంజనాన్ని చూపించారు. ఎన్టీఆర్ కి 13 సంవత్సరాలు ఉన్నప్పుడే ‘రామాయణం’ సినిమాతో ప్రేక్షకులని మెప్పించారు. పూర్తిగా పిల్లలతోనే తెరకెక్కిన ఈ రామాయణం సినిమా బాల రామాయణంగా బాగా ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 1996లో అందరూ పిల్లలతోనే ‘రామాయణం’ సినిమాని చిత్రీకరించారు.

Pooja Hegde : బుట్టబొమ్మ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సాంగ్.. ఆ హీరో స్పెషల్ పార్టీ ఇచ్చారు..

ఇందులో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా స్మితా మాధవ్, లక్ష్మణుడిగా నారాయణం నిఖిల్, రావణాసురుడిగా స్వాతి కుమార్ నటించారు. రామాయణంలోని అన్ని పాత్రలని కూడా చిన్న పిల్లలతోనే నటింపచేశారు గుణశేఖర్. అప్పట్లో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చిన్న పిల్లలతో సినిమా అంత బాగా వచ్చింది అంటే కారణం గుణశేఖర్ ఓపిక. ఆ పిల్లలందరికీ అర్థమయ్యేలా చెప్పి, తనకి కావాల్సిన విధంగా నటింపచేశారు గుణశేఖర్. ఈ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ బాల రామాయణానికి ప్రేక్షకులు భారీ విజయం ఇచ్చారు. బాల రామాయణం సినిమాకి విపరీతమైన ప్రజాదరణ లభించింది. రాముడిగా ఎన్టీఆర్, సీతగా స్మిత మాధవ్, మిగిలిన అన్ని పాత్రల్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా నటించి అందర్నీ మెప్పించారు.

Toolsidas Junior : స్నూకర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొదటి సినిమా..

ఈ సినిమాలోని పాటలు అన్ని కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రామాయణం సినిమా కోసం దాదాపు 3000 మంది పిల్లలని నటింపచేశారు. ఈ పిల్లలందర్నీ పలు స్కూల్స్ కి వెళ్లి ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ రామాయణం సినిమా నేషనల్ బెస్ట్ చైల్డ్ ఫిలిం అవార్డు సాధించింది. అంతే కాక బెస్ట్ చైల్డ్ ఫిలిం నంది అవార్డు కూడా సాధించింది. ఈ సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి మల్లెమాల సుందర రామిరెడ్డి శబ్దాలయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. దీనికి మాధవపెద్ది సురేష్, వైద్యనాథన్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజ్ అయి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.