రివ్యూ : 2 అవర్స్ లవ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 5, 2019 / 02:56 PM IST
రివ్యూ :  2 అవర్స్ లవ్

కొత్తతరం డైరక్టర్లు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథ,కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకెళ్తున్నారు. చిన్న సినిమా అయినా అయినా సరే బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. భారీ విజయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే కొత్త హీరోలను, డైరక్టర్లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా తానే హీరోగా మారి తన సొంత డైరక్షన్ లో  శ్రీపవార్ తెరకెక్కించిన సినిమా 2 hours love(రెండు గంటల ప్రేమ). హీరో, దర్శకడిగా తన ప్రయత్నంలో శ్రీపవార్ సక్సెస్ అయ్యారా? సినిమా ఎలా ఉంది? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ చూద్దాం… 

అధయ్ (శ్రీపవర్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కాఫీ షాప్‌లో పనిచేసే నయన (క్రితి గర్గ్)తో ప్రేమలో పడతాడు. అధయ్ ప్రేమను నయన ఒప్పుకుంటుంది.. కానీ కొన్ని షరతులు పెడుతుంది. నేను కేవలం సాయంత్రం 4-6 మాత్రమే నిన్ను ప్రేమిస్తాను అని చెబుతుంది. నయనని గాఢంగా ప్రేమించిన అధయ్ వేరే దారి లేక షరతులకు ఒప్పుకుని అగ్రీమెంట్ మీద సంతకం చేస్తాడు. మరో వైపు విలన్ గ్యాంగ్ నయనతో ఉన్న పాత గొడవల కారణంగా తనపై ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయం తెలిసిన అధయ్ నయనను రక్షించడానికి ఏం చేశాడు? విలన్స్ నుంచి నయనను ఎలా కాపాడాడు? అసలు అధయ్, నయన పెట్టుకున్న షరతులు ఏంటి, వాళ్ళిద్దరి గతం ఏమిటి? రెండో భాగంలో వాళ్లిద్దరికీ ఏమైంది? వాళ్ళు పెళ్ళిచేసుకున్నారా లేదా? వారికి, విలన్ కి మధ్య ఉన్న విభేధాలు తొలగాయా లేదా? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

పాజిటివ్ పాయింట్స్ : కథ, కథనం, ఒక కొత్త రకమైన ప్రేమకథ. అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలో ఉన్న మలుపు  థ్రిల్‌కు గురిచేస్తుంది.

మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా కథ కొంచెం నిదానంగా సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంకొంచెం కామెడీ ఉంటే బాగుండేది.

ఓవరాల్‌గా చెప్పాలంటే… 2అవర్స్ లవ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ మెప్పించే ఓ కొత్త రకమైన లవ్ స్టోరీ. 

చివరిగా 2 హావర్స్ లవ్  యూత్ ను ఆకట్టుకునే ఆసక్తికరమైన ఫీల్ గుడ్ మూవీ.