Abhinaya Sri : బిగ్‌బాస్ అంతా మోసం.. నాకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు.. నాకంటే తక్కువ ఓట్లు వచ్చినా..

అభినయశ్రీ మాట్లాడుతూ.. ''బిగ్‌బాస్ అంతా మోసం. నాకు సంబంధించిన సెండ్ ఆఫ్ వీడియోను గంట షోలో కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదు. బిగ్‌బాస్ నాకు అన్యాయం చేసింది. బిగ్‌బాస్ షో వల్ల................

Abhinaya Sri : బిగ్‌బాస్ అంతా మోసం.. నాకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు.. నాకంటే తక్కువ ఓట్లు వచ్చినా..

Abhinayasri Sensational comments on BiggBoss

Updated On : September 20, 2022 / 10:05 AM IST

 

Abhinaya Sri :  బిగ్‌బాస్ ఆరో సీజన్ మొదలయి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. మొదటివారం ఎవర్ని ఎలిమినేట్ చేయకుండా రెండో వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేశారు. శనివారం నాడు షానిని ఎలిమినేట్ చేయగా, ఆదివారం నాడు అభినయశ్రీని ఎలిమినేట్ చేశారు. ఇప్పటికే ఈ ఎలిమేషన్లపై విమర్శలు వచ్చాయి. షానీని పంపిద్దామని అప్పటికప్పుడు డిజైన్ చేసుకున్నారని ఓట్లతో సంబంధం లేకుండా పంపించారని, సెండ్ ఆఫ్ వీడియో కూడా ప్లే చేయలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. హౌస్ లోంచి బయటకి వచ్చినవాళ్లు మరింత ఫేమ్ అవ్వడానికి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. కొంతమంది బిగ్‌బాస్ గురించి గొప్పగా చెప్తే మరికొంతమంది విమర్శలు కూడా చేస్తారు. తాజాగా రెండోవారంలో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నటి అభినయశ్రీ ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ ని దారుణంగా విమర్శించింది.

Youtuber Nikhilu Birthday Celebrations : యూట్యూబర్ నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో నిహారిక సందడి

అభినయశ్రీ మాట్లాడుతూ.. ”బిగ్‌బాస్ అంతా మోసం. నాకు సంబంధించిన సెండ్ ఆఫ్ వీడియోను గంట షోలో కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదు. బిగ్‌బాస్ నాకు అన్యాయం చేసింది. బిగ్‌బాస్ షో వల్ల నాకేమి ఒరగలేదు. ఆ షో నాకు హెల్ప్ అవ్వలేదు. ఇక అందులో పాల్గొన్నందుకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. అంతేకాక హౌస్ లో నా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఉంచి నన్ను పంపించేశారు. ఇది చాలా అన్యాయం” అని వాపోయింది. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.