Nagarjuna : నాగార్జున సినిమాతో.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు గొడవ..

నాగార్జున ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో టైగర్ నాగేశ్వరరావు నిర్మాతతో..

Nagarjuna : నాగార్జున సినిమాతో.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు గొడవ..

Abhishek Agarwal comments on Nagarjuna Naa Saami Ranga movie conflict

Updated On : October 13, 2023 / 8:32 PM IST

Nagarjuna : నాగార్జున తన మూవీ ‘ఘోస్ట్’ ప్లాప్ తరువాత చాలా గ్యాప్ తీసుకోని అనౌన్స్ చేసిన మూవీ ‘నా సామిరంగ’. అయితే ఈ మూవీ విషయంలో పెద్ద రచ్చే జరిగిందట. ఈ మూవీని నిర్మాత అభిషేక్ అగర్వాల్ చేయాల్సిందట. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో ఉన్న ఈ నిర్మాత ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘నా సామిరంగ’ మేకర్స్ అధికారికంగా తెలియజేయనప్పటికీ.. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ‘పోరింజు మరియం జోస్’కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ అభిషేక్ అగర్వాల్ దగ్గర ఉన్నాయి.

Also read : Gopichand 32 : ఇంత స్పీడా..? గోపీచంద్‌తో శ్రీను వైట్ల మూవీ అప్పుడే..!

అయితే ఈ కథతోనే నాగార్జున వేరే నిర్మాతలతో ‘నా సామిరంగ’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిషేక్ అగర్వాల్.. ఆమధ్య ఒక అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఆ మూవీ రీమేక్ రైట్స్ మా దగ్గర మాత్రమే ఉన్నాయని. అయితే ఆ తరువాత నాగార్జున సినిమా నిర్మాతలు, అభిషేక్ అగర్వాల్ మధ్య చర్చలు జరగడంతో.. గొడవ క్లియర్ అయ్యి ‘నా సామిరంగ’ సినిమాకి అడ్డంకులు లేకుండా పోయాయి. కాగా నా సామిరంగ సినిమాని చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్నాడు.

Also read : Rocking Rakesh : రాకింగ్ రాకేష్ హీరోగా మొదటి మూవీ.. KCR గా కనిపించబోతున్న..

కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా కథ జరుగుతుంది. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి తీసుకు వస్తామంటూ మేకర్స్ ప్రకటించారు.