హన్సిక ఫోన్, ట్విట్టర్ హ్యాక్
హన్సిక న్యూయార్క్‌లో తీసుకున్న ప్రైవేట్ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Hansika Motwani (Image:Instaragam)
హన్సిక న్యూయార్క్‌లో తీసుకున్న ప్రైవేట్ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
హాట్ బ్యూటీ హన్సిక పర్సనల్ పిక్స్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హన్సిక రీసెంట్‌గా న్యూయార్క్ టూర్‌కెళ్ళింది. అక్కడ తను తీసుకున్న ప్రైవేట్ పిక్స్ ఎలాగో లీకై, నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఏంటీ ఫోటోలు అని అభిమానులు హన్సికని అడగడంతో ఆమె షాక్ అయ్యింది. వెంటనే ఆ పిక్స్‌ని డిలీట్ చేసేసింది. తన ఫోన్, ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యాయనీ, ప్రస్తుతం వాటి నుండి వచ్చే మెసేజెస్‌కి ఎవరూ రిప్లై ఇవ్వొద్దని, రెస్పాండ్ కావొద్దని హన్సిక తన ఫాలోయర్స్‌కి చెప్పింది.
ఎవరు హ్యాక్ చేసారు ఏంటి అనేది తెలుసుకునే పనిలో నా టీమ్ ఉంది. అని హన్సిక అంది. గతంలోనూ కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ పర్సనల్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం, విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది. అప్పుడామె ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైట్ చేసింది. ఇప్పుడు హన్సిక ఏం చేస్తుందో చూడాలి మరి.