ఆర్టికల్ 370 ఆధారంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’

కాశ్మీర్‌ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’.. ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 04:54 AM IST
ఆర్టికల్ 370 ఆధారంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’

Updated On : October 26, 2019 / 4:54 AM IST

కాశ్మీర్‌ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’.. ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు..

మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవడమే కాదు.. మన దర్శక, నిర్మాతలు బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్రనిర్మాతలు ఇప్పటికే తమ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఇప్పుడు మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా హిందీలో సినిమా నిర్మించనున్నారు.

కాశ్మీర్‌ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న చిత్రం ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’.. ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు.

Read Also : అల్లు అర్జున్ వాయిస్‌తో ‘రాములో రాములా’

‘ఆర్టికల్‌ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్‌ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్‌ పాత్రల్లో ప్రముఖ నటులు నటిస్తారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అని మేకర్స్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.