Sarvam Shakthi Mayam : అష్ఠాదశ పీఠాలపై ఆహా సరికొత్త వెబ్ సిరీస్.. ‘సర్వం శక్తిమయం’ రిలీజ్ డేట్..

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా ఆహా ఒక సరికొత్త వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతుంది. భారతదేశంలోని మొత్తం 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం..

Sarvam Shakthi Mayam : అష్ఠాదశ పీఠాలపై ఆహా సరికొత్త వెబ్ సిరీస్.. ‘సర్వం శక్తిమయం’ రిలీజ్ డేట్..

Aha New telugu web series Sarvam Shakthi Mayam streaming update

Updated On : October 9, 2023 / 6:53 PM IST

Sarvam Shakthi Mayam : తెలుగు ఓటీటీ ఆహా కొత్త వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. తాజాగా ‘అష్ఠాదశ పీఠాల దివ్యదర్శన మేళా’ అంటూ ఒక సరికొత్త వెబ్ సిరీస్ ని రెడీ చేస్తుంది. ‘సర్వం శక్తిమయం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేస్తున్నాడు. బివిఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రియమణి, సంజయ్ సూరి ఈ సిరీస్ లో మెయిన్ లీడ్స్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు.

పరాశక్తి పర్వదినాలు ప్రవేశిస్తున్న వేళ అక్టోబర్ 20 నుంచి ఈ సిరీస్ ని ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి తిరుగుతుంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి శక్తిపీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుంది. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుంది.

Also read : Ganapath Trailer : టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ ట్రైలర్ రిలీజ్.. ఇది సూపర్ హీరో సినిమా కదా.. స్పోర్ట్స్ మూవీనా..?

ఈ సిరీస్ లో భారతదేశంలోని మొత్తం 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం కూడా చూపించబోతున్నారు. మొత్తం పది ఎసిసోడ్‌లతో వస్తున్న ఈ సిరీస్ ని అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటుగా.. సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)