ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ ప్రారంభం

ఆకాష్ పూరీ ‘చోర్ బజార్’ ప్రారంభం

Chor Bazaar: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న మూడో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్‌స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘‘చోర్ బజార్’’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్‌కు చేరుతుంటాయి. అయితే ఈ కథంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు.

Chor Bazaar

‘‘చోర్ బజార్’’ సినిమా గురువారం హైదరాబాద్‌లోని ప్రొడక్షన్ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాష్‌పై సోదరి పవిత్ర పూరీ క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి.ఎస్.ఎన్ రాజు ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ అందించారు.

వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘‘చోర్ బజార్’’ చిత్రంలో సుబ్బరాజు, పోసాని, ‘లేడీస్ టైలర్’ ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

Chor Bazaar