Anushka Shetty : 14 భాషల్లో రిలీజ్ కానున్న అనుష్క కొత్త సినిమా.. టీజరే వెన్నులో వణుకుపుట్టిస్తోందిగా..!
అనుష్క శెట్టి (Anushka Shetty) తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. సూపర్ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్నది అరుంధతి సినిమాతో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది.

Kathanar The Wild Sorcerer Glimpse
Anushka Shetty New Movie : అనుష్క శెట్టి (Anushka Shetty) తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ‘సూపర్’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్నది ‘అరుంధతి’ సినిమాతో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. బాహుబలితో పాన్ ఇండియా లెవల్‌లో పాపులర్ అయ్యింది. తన 18 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం సినిమాల్లో మాత్రమే నటించింది. తాజాగా ఈ బ్యూటీ మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతోంది.
‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ (Kathanar The Wild Sorcerer Movie) పేరుతో వస్తోన్న ఓ హారర్ సినిమాలో అనుష్క నటిస్తోంది. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయసూర్య (Jayasurya) హీరోగా నటిస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఈ చిత్రంలో అనుష్క పాత్ర అరుంధతి తరహాలో ఉండనుందని తెలుస్తోంది.
Kushi OTT : ఖుషి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా..?
రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి భాగం 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 14 భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం తెలిసిన అనుష్క ఫ్యాన్స్ పుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తుండగా పి.మహేశ్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అనుష్క చెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.