B.Gopal : దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రే పురస్కారం..

తెలుగులో మాస్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాలంటే ఒకప్పుడు గుర్తొచ్చే డైరెక్టర్ పేరు బి.గోపాల్. అసెంబ్లీ రౌడీ, బొబ్బిలిరాజా , నరసింహనాయుడు, సమర సింహ రెడ్డి, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ

B.Gopal : దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రే పురస్కారం..

B Gopal

B.Gopal :  తెలుగులో మాస్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాలంటే ఒకప్పుడు గుర్తొచ్చే డైరెక్టర్ పేరు బి.గోపాల్. అసెంబ్లీ రౌడీ, బొబ్బిలిరాజా , నరసింహనాయుడు, సమర సింహ రెడ్డి, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించారు బి.గోపాల్. ఇటీవల గోపీచంద్ తో ‘ఆరడుగుల బులెట్’ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. తాజాగా బి.గోపాల్ కి అరుదైన పురస్కారం లభించింది.

తెలుగు సినీ దర్శకుడు బి.గోపాల్‌కు ప్రతిష్టాత్మకమైన సినీ పురస్కారం సత్యజిత్‌ రే అవార్డు వరించింది. భారతీయ సినీ పరిశ్రమకు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు కేరళకు చెందిన సత్యజిత్‌ రే ఫిల్మ్‌ సొసైటీ ప్రకటించింది. ప్రముఖ మలయాళ దర్శకుడు బాలు కిరియత్‌, సంగీత దర్శకుడు పెరుంబవూర్‌ జీ రవీంద్రనాథ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులతో కూడిన సత్యజిత్ రే అవార్డు ప్యానల్‌ పురస్కార విజేతగా బి.గోపాల్‌ను ఎన్నుకున్నారు.

ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే వేడుకలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. 1986లో ‘ప్రతి ధ్వని’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి నేడు ‘ఆరడుగుల బులెట్’ వరకు తెలుగు, హిందీ భాషల్లో 35 సినిమాల వరకు బి.గోపాల్‌ దర్శకత్వం వహించారు.