Prakash Raj : బోరున ఏడ్చిన బెనర్జీ.. మా అమ్మను తిట్టారంటూ తనీష్ భావోద్వేగం

మోహన్ బాబు తనను కొట్టబోయారంటూ బెనర్జీ, తన తల్లిని దూషించారని తనీష్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు..

10TV Telugu News

Prakash Raj: ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా, ఇంకాస్త రసవత్తరంగా.. రసాబాసగా, హైడ్రామా మధ్య ఆదివారం ఎన్నికలు జరిగాయి. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం సాధించాడు. ఆదివారం రాత్రి నాగబాబు, సోమవారం ఉదయం ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Prakash Raj: ‘MAA’కు మూకుమ్మడి రాజీనామా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం

ఎన్నికలప్పుడు జరిగిన పరిస్థితులను ఒక్కొకరుగా వెల్లడించారు సభ్యులు. వేర్పాటు వాదం కారణంగా కలిసి పనిచెయ్యలేమని గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సీనియర్ నటుడు బెనర్జీ, తనీష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Prakash Raj: ‘మా’లోనే ఉంటా.. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటా.. ఒక్క కండీషన్! -ప్రకాష్ రాజ్

బెనర్జీ మాట్లాడుతూ.. ‘విష్ణుని చిన్నప్పుడు ఎత్తుకున్నాను. లక్ష్మీ పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. మోహన్ బాబు, మేం కుటుంబ సభ్యుల్లానే ఉండేవాళ్లం. అయితే పోలింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు, తనీష్‌ను తిడుతుంటే.. నేను విష్ణుతో గొడవలొద్దని చెప్పాను. దీంతో మోహన్ బాబు అసభ్య పదజాలంతో తిడుతూ నన్ను కొట్ట బోయారు.. అందరూ నేను గెలిచానని కాల్స్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నా స్వీకరించలేకపోతున్నాను. గత మూడు రోజులుగా దు:ఖాన్ని ఆపుకుంటున్నాను. మోహన్ బాబు భార్య ఫోన్ చేసి సారీ చెప్పారు. నాకు సారీ ఏం వద్దని చెప్పాను’ అంటూ భోరున విలపించారు.

తనీష్ మాట్లాడుతూ.. ‘మా’ మంచి కోసమే ఈ రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నాను. నన్ను నమ్మి ఓట్లేసిన వారికి థ్యాంక్స్, సారీ.. అందరూ నువ్వు మా బిడ్డలాంటి వాడివి.. కృష్ణానగర్ నుంచి ఈ స్థాయికి వచ్చావు. నీకు మా కష్టాలు తెలుసు. తప్పకుండా న్యాయం చేస్తావనే నమ్మకముంది అని ఫోన్స్ చేసి చెప్పారు. ఎన్నికలప్పుడు మోహన్ బాబు గారు బూతులు తిట్టారు.. మా అమ్మను కించపరిచారు.. అమ్మను అన్న మాటలు మర్చిపోలేక పోతున్నా’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

×