BiggBoss 6 Day 49 : బిగ్‌బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్.. ఏడ్చేసిన శ్రీసత్య..

ఇక అర్జున్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అని తెలియడంతో శ్రీ సత్య ఎమోషనల్ అయింది. అర్జున్ కళ్యాణ్ బిగ్‌బాస్ స్టేజి మీదకి వచ్చాక శ్రీసత్యని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. శ్రీసత్య ఏడవడంతో అర్జున్ కూడా..............

BiggBoss 6 Day 49 : బిగ్‌బాస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్.. ఏడ్చేసిన శ్రీసత్య..

BiggBoss 6 Day 49 diwali and weekend special episode and elimination episode

BiggBoss 6 Day 49 :  బిగ్‌బాస్ అప్పుడే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి, సుదీపలు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో మరొకర్ని ఇంటి నుంచి పంపించారు. ఎలిమినేషన్ ముందు వీకెండ్ మరియు దీపావళి స్పెషల్ కావడంతో ఈ ఎపిసోడ్ కళకళలాడిపోయింది. దీపావళి సందర్భంగా కంటెస్టెంట్స్ కి స్పెషల్ గేమ్స్ పెట్టారు. ఆడించారు, పాడించారు, డ్యాన్సులు వేయించారు. కంటెస్టెంట్స్ ని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిపి జోడీలుగా విడగొట్టారు. ఇందులో అబ్బాయిలతో అమ్మాయి గెటప్స్ వేయించి క్యాట్ వాక్ చేయించారు. ఇది ఫుల్ ఫన్ గా సాగింది. ఆ తర్వాత ఫుడ్ తినే పోటీ పెట్టారు.

ఇక యాంకర్ రష్మీ, హీరోయిన్ అవికా గోర్ లు స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చి తమ డ్యాన్సులతో అలరించారు. సర్దార్ సినిమా ప్రమోషన్ కోసం కార్తీ, రజీషా, డైరెక్టర్ మిత్రన్ కూడా బిగ్‌బాస్ హౌజ్ కి వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ తో అలరించారు. అలాగే ఝాన్సీ ప్రమోషన్స్ లో భాగంగా అంజలి కూడా బిగ్‌బాస్ కి వచ్చింది. ఆది కూడా వచ్చి హౌజ్ లో ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తున్నారో, బయటకి జనాలు ఏం అనుకుంటున్నారో చెప్పి అందర్నీ నవ్వించాడు. కంటెస్టెంట్స్ మీద తనదైన శైలిలో పంచులు వేసి నవ్వించాడు ఆది.

ఇక ఎలిమినేషన్ ఘట్టంలో ఈ వారం నామినేషన్స్ లో రేవంత్‌, బాలాదిత్య, రోహిత్‌, వాసంతి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఉన్నారు. ఎపిసోడ్ మొదటి నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగార్జున ఇక చివరికి వాసంతి, అర్జున్ కళ్యాణ్ లు మిగిలారు. అంతా వాసంతి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. కానీ చివర్లో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

BiggBoss 6 Day 48 : హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?.. మెరీనాని అన్యాయం చేసేశారుగా..

ఇక అర్జున్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అని తెలియడంతో శ్రీ సత్య ఎమోషనల్ అయింది. అర్జున్ కళ్యాణ్ బిగ్‌బాస్ స్టేజి మీదకి వచ్చాక శ్రీసత్యని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. శ్రీసత్య ఏడవడంతో అర్జున్ కూడా ఏడ్చేశాడు. ఇక హౌజ్ లో ఉన్న వాళ్లలో పేలే టపాసులు, తుస్సుమనే టపాసులు ఎవరో చెప్పమని నాగార్జున అడగగా శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌, గీతూ, ఫైమాలు పేలే టపాసులు అని, రోహిత్‌, మెరీనా, కీర్తి, ఇనయ, బాలాదిత్య తుస్సుబాంబులు అని చెప్పాడు. అలాగే తాను శ్రీసత్య కోసమే బిగ్‌బాస్ హౌజ్ కి వచ్చానని ఎలా వచ్చాడో తెలిపాడు. దీంతో శ్రీసత్య ఆశ్చర్యపోయింది.