Chiranjeevi : స్నేహితుడు కోసం హాస్పిటల్‌కి చిరంజీవి.. డాక్టరుతో మాట్లాడి..
చిరంజీవి తన చిన్నప్పటి స్నేహితుడు ఆరోగ్యం విషయం తెలుసుకొని వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నాడు. అక్కడ డాక్టరుతో మాట్లాడి..

Chiranjeevi helps his childhood friend trough apollo hospital
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సేవ గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమానులకు మాత్రమే కాకుండా తన తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు సేవలు అందిస్తుంటాడు. తాజాగా చిరంజీవి తన చిన్నప్పటి స్నేహితుడు ఆరోగ్యం విషయం తెలుసుకొని వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నాడు. అక్కడ డాక్టరుతో మాట్లాడి ఆరోగ్య విషయాలను కనుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరు..?
మొగల్తూరులో చిన్ననాటి మిత్రుడు అయిన పువ్వాడ రాజా అనారోగ్యంతో కొంతకాలంగా బాధ పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. స్నేహితుడిని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా చిరంజీవి హాస్పిటల్ కి వచ్చి స్నేహితుడిని పరామర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు. అలాగే డాక్టర్ తో మాట్లాడి స్నేహితుడు ఆరోగ్య పరిస్థితిని డీటెయిల్‌గా తెలుసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : Prabhas : జపాన్ అభిమానుల.. ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా..?
A Friend in Need is a Friend Indeed ❤️
Megastar ✨ Chiranjeevi garu inquired Doctors about the Health condition of his Childhood friend Puvvada Raja garu of Mogalthur at Apollo Hospital Hyderabad.#MegaStarChiranjeevi @KChiruTweets pic.twitter.com/pPHWVJemKL
— Ujjwal Reddy (@HumanTsunaME) October 22, 2023
ఇవి చూసిన అభిమానులు.. చిరంజీవి ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం Mega157 చేస్తున్నాడు. బింబిసార సినిమాతో హిట్ కొట్టిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర తన ఏజ్ కి తగ్గట్టు ఉంటుందని, కమల్ హాసన్ ‘విక్రమ్’, రజినీకాంత్ ‘జైలర్’ సినిమా తరహాలో ఈ సినిమాలో చిరు పవర్ ఫుల్ క్యారెక్టర్ తో కనిపించనున్నాడని దర్శకుడు అభిమానులకు తెలియజేశాడు.