Chota K Naidu : చిరంజీవి విషయంలో గరికపాటికి కౌంటర్ ఇచ్చిన చోటా కె నాయుడు
చోటా కె నాయుడు మాట్లాడుతూ.. ''భారతదేశ సినిమా స్క్రీన్ పై చిరంజీవి గారితో ఎవర్ని పోల్చలేం. స్టార్ హీరో చిరంజీవి. రీసెంట్‌గా ఆయన మీద అభిమానంతో కొంతమంది ఫోటోలు తీసుకుంటుంటే ఆయన ఎవరో మహాపండితుడు............

Chota K Naidu : చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.
ఇటీవల ఓ సభలో గరికపాటి నరసింహారావు మాట్లాడాల్సిన సమయంలో అందరూ చిరంజీవితో ఫోటోలకు ఎగబడుతుండటంతో గరికపాటి చిరంజీవి మీద సీరియస్ అయ్యారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ ఈవెంట్లో కెమెరామ్యాన్ చోటా కె నాయుడు మాట్లాడుతూ గరికపాటి విషయాన్ని ప్రస్తావించారు.
BiggBoss 6 Day 34 : హౌస్ లో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది ఎవరు?
చోటా కె నాయుడు మాట్లాడుతూ.. ”భారతదేశ సినిమా స్క్రీన్ పై చిరంజీవి గారితో ఎవర్ని పోల్చలేం. స్టార్ హీరో చిరంజీవి. రీసెంట్‌గా ఆయన మీద అభిమానంతో కొంతమంది ఫోటోలు తీసుకుంటుంటే ఆయన ఎవరో మహాపండితుడు అలా మాట్లాడవచ్చా. అది తప్పు కదా. ఆయన అలా మాట్లాడినా చిరంజీవి గారు సైలెంట్ గా ఉన్నారు. అలాంటివాళ్ళని కూడా చిరంజీవి ఇంటికి ఆహ్వానిస్తారు అంటే అది ఆయన సంస్కారం. చిరంజీవి గారి దగ్గర్నుంచి ఆ సంస్కారం నేర్చుకోవాలి” అని అన్నారు.