Hansika Motwani: పెళ్లి పీటలు ఎక్కుతున్న హన్సిక.. పెళ్ళికొడుకు ఎవరన్నది సీక్రెట్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన "హన్సికా మోట్వాని".. దక్షణాది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2007లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'దేశముదురు' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైనా హన్సిక, మొదటి సినిమాతోనే తెలుగులో బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. కాగా ఈ పిల్లి కళ్ళ చిన్నది ఈ ఏడాది చివరిలో పెళ్లికూతురు కాబోతుంది.

Hansika Motwani: పెళ్లి పీటలు ఎక్కుతున్న హన్సిక.. పెళ్ళికొడుకు ఎవరన్నది సీక్రెట్!

Hansika Motwani getting Married

Updated On : October 17, 2022 / 4:26 PM IST

Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన “హన్సికా మోట్వాని”.. దక్షణాది స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2007లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైనా హన్సిక, మొదటి సినిమాతోనే తెలుగులో బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది.

Hansika Motwani Increases Glamour Dose: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన హన్సిక..!

ఇక తమిళనాట అయితే ఈ అమ్మడికి అభిమానులు గుడిని కట్టి.. దేవతల ఆరాధించే అంత అభిమానాన్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలతో కలిపి మొత్తం 50కి పైగా సినిమాలో నటించిన హన్సిక.. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకోవడంలో వెనకబడింది. దీంతో ఈ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ పిల్లి కళ్ళ చిన్నది ఈ ఏడాది చివరిలో పెళ్లికూతురు కాబోతుంది. రాజస్థాన్ లోని జైపూర్ కోట వేదికగా ఈ వేడుక జరుగనుంది. డిసెంబర్ లో జరగబోయే పెళ్లిసందడి కోసం ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అయితే ఈ అందాల భామని పెళ్లాడేది ఎవరన్నా విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచుతున్నారు.