Ira Khan : పెళ్లికిముందే హనీమూన్‌కి వెళ్లిన స్టార్ హీరో కూతురు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

ఫిట్‌నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ అయిన నుపుర్ తో(Nupur Shikhare) ఐరా గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. గత సంవత్సరం నవంబర్ లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

Ira Khan : పెళ్లికిముందే హనీమూన్‌కి వెళ్లిన స్టార్ హీరో కూతురు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Ira Khan shared pics with Nupur Shikhare they enjoyed in Resort before Marriage

Updated On : August 28, 2023 / 9:34 AM IST

Ira Khan :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) కూతురిగా ఐరా ఖాన్ అందరికి సుపరిచితమే. సోషల్ మీడియాలో తాను పెట్టే హాట్ హాట్ ఫొటోలతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఐరా ఖాన్. గత సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకల్ని బికినీ వేసుకొని సెలెబ్రేట్ చేసుకొని వివాదంలో కూడా చిక్కుకుంది. ఇక ఐరా ఖాన్ గత రెండేళ్లుగా నుపుర్ శిఖర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది.

ఫిట్‌నెస్ ట్రైనర్, సైక్లిస్ట్ అయిన నుపుర్ తో(Nupur Shikhare) ఐరా గత రెండేళ్లుగా ప్రేమలో ఉంది. గత సంవత్సరం నవంబర్ లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఐరా, నుపూర్ ప్రేమ‌కు ఇరు కుటుంబాలు ఓకే చెప్పడంతో వారి నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అంతా ప్రశ్నిస్తున్నారు. తాజాగా పెళ్ళికి ముందే హనీమూన్ కి వెళ్లి ఆ ఫోటోలని షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఐరా.

Hesham Abdul Wahab : ‘ఖుషి’ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఖుషి సినిమా గురించి..
రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ కి వెళ్లారు ఐరా, నుపుర్. రిసార్ట్ లో ప్రకృతి మధ్య హ్యాపీగా గడిపారు. చెట్ల మధ్యలో ఉన్న ఓ బెడ్ పై ఐరా, నుపుర్ కలిసి ఉన్న ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐరా ఖాన్. నుపుర్ కూడా ఐరాతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో పెళ్ళికి ముందే డేటింగ్ పేరుతో జంటలు బాగా తిరిగేస్తారని తెలిసిందే. అందులో ఇప్పుడు ఈ జంట కూడా చేరింది. అయితే నుపుర్ మాత్రం సండే ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం అని పెట్టాడు. ఏదైనా ఏముంది అని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందే ఐరా ఖాన్, నుపుర్ ఇలా హనీమూన్ ట్రిప్స్ వేస్తుండటంతో త్వరగా పెళ్లి చేసేసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

View this post on Instagram

A post shared by Popeye ⚓ (@nupur_popeye)