Krithi Shetty : కథ చెప్తే నోట్స్ రాసుకుంటా.. పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఇదే కథ..
ది వారియర్ సినిమా గురించి కృతి మాట్లాడుతూ..''పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడే ప్రేమ పుడుతుంది. అది ఎలా అనేది సినిమాలో చూడాల్సిందే. ఇది ఫుల్ మాస్ యాక్షన్..........

Krithi Shetty
Krithi Shetty : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టింది కృతిశెట్టి. ఆ తర్వాత శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించింది. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో వరుస అవకాశాలని సంపాదిస్తుంది. త్వరలో రామ్ సరసన ది వారియర్ సినిమాతో రాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది కృతి శెట్టి.
ది వారియర్ సినిమా గురించి కృతి మాట్లాడుతూ..”పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడే ప్రేమ పుడుతుంది. అది ఎలా అనేది సినిమాలో చూడాల్సిందే. ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో ఓ పక్కింటి అమ్మాయిలాగా, క్యూట్‌గా, చలాకీగా కనిపిస్తాను. వారియర్ సినిమాలో నా పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి. ఓ రేడియో స్టేషన్‌లో ఆర్జేగా చేస్తూ ఉంటాను. నా పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. దీనికోసం చాలానే హోంవర్క్ చేశాను” అని తెలిపింది.
ఇక తన గురించి చెప్తూ.. ”నా సినీ ప్రయాణం చాలా ఆనందంగా ఉంది. ఉప్పెన తర్వాత తెలుగు, తమిళ్ ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. నాపై అంత ప్రేమ చూపిస్తారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వారియర్ సినిమాతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళం నేర్చుకుంటున్నాను. ఒక సినిమా ఓకే చేస్తే అందులో నేను పోషించే పాత్ర కోసం కచ్చితంగా నోట్స్ రాసుకుంటాను. ప్రేక్షకుల్ని మెప్పించాలి కాబట్టి కథల ఎంపికపై ఒత్తిడి ఉంది. ఏ కథ విన్నా కచ్చితంగా మా అమ్మ అభిప్రాయాలు తీసుకుంటాను. ఎప్పటికైనా ఫుల్ యాక్షన్ రోల్ చేయాలని డ్రీమ్ ఉంది” అని కృతిశెట్టి తెలిపింది.