Vignesh Shivan : కొత్త కాపురం కోసం చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో.. 25 కోట్లతో రెండిళ్ళు కొన్న నయనతార..

నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో కలిసి ఉండాలి అనుకున్నారు. దీంతో చెన్నై పోయెస్‌గార్డెన్‌ లో రెండు ఇళ్లు కొని వాటికి మరమ్మత్తులు చేపిస్తున్నారు. నయనతార కొనుగోలు చేసిన..........

Vignesh Shivan : కొత్త కాపురం కోసం చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో.. 25 కోట్లతో రెండిళ్ళు కొన్న నయనతార..

Nayan Vignesh

Updated On : July 6, 2022 / 7:30 AM IST

Nayanathara :  స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. థాయిలాండ్ కి హనీమూన్ కి కూడా వెళ్లివచ్చారు. త్వరలో ఈ స్టార్ కపుల్ కొత్త ఇంట్లో కాపురం మొదలుపెట్టనున్నారు. చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియా పోయెస్‌గార్డెన్‌. స్టార్ సెలబ్రిటీల ఇళ్లు అన్ని ఇక్కడే ఉంటాయి. తాజాగా నయనతార కూడా ఇదే ఏరియాలో రెండు ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Gautham Raju : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..

నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి తర్వాత కొత్త ఇంట్లో కలిసి ఉండాలి అనుకున్నారు. దీంతో చెన్నై పోయెస్‌గార్డెన్‌ లో రెండు ఇళ్లు కొని వాటికి మరమ్మత్తులు చేపిస్తున్నారు. నయనతార కొనుగోలు చేసిన ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉందని సమాచారం. బాలీవుడ్‌ స్టార్స్‌ ఇళ్లకు ఇంటీరియర్‌ డిజైన్‌ చేసే ఒక ప్రముఖ సంస్థని పిలిపించి మరీ వీటిని రీమోడలింగ్ చేపిస్తుందట నయనతార. స్విమ్మింగ్‌పూల్, స్పెషల్ లిఫ్ట్, జిమ్ ఏరియా.. ఇలా స్పెషల్ ఫీచర్స్ అన్ని ఉండేలా చూసుకుంటుంది నయన్. రీమోడలింగ్ అవ్వగానే త్వరలోనే ఈ స్టార్ కపుల్ అందులోకి మారనున్నారు. మొత్తానికి మ్యారేజ్ లైఫ్ ని మరింత అందంగా తీర్చి దిద్దుకుంటుంది నయనతార.