Mahesh Babu : అక్కలతో మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటో..

టాలీవుడ్ లెజెండ్స్ ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ సంస్మరణ సభకు అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి, కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా ఈ కారిక్రమంలో మహేష్ బాబు తన అక్కలు..

Mahesh Babu : అక్కలతో మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటో..

Mahesh Babu pic with his sisters gone viral

Mahesh Babu : టాలీవుడ్ లెజెండ్స్ ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం మనందరికి తెలిసిందే. ఇక కృష్ణపై అంతులేని అభిమానం చూపించే అభిమానుల మధ్య ఈ ఆదివారం నాడు కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు మహేష్ బాబు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈ సంస్మరణ సభ జరిగింది.

Mahesh Babu : నాన్న నాకు ఎన్నో ఇచ్చాడు.. అందులో గొప్పది మీ అభిమానం.. మహేష్ బాబు!

ఇక ఈ సంస్మరణ సభకు అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా ఈ కారిక్రమంలో మహేష్ బాబు తన అక్కలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినితో దిగిన ఫోటో వైరల్ మారింది. కృష్ణకి మొత్తం ఐదుగురు పిల్లలు. అందులో మొదటి వాడు రమేష్ బాబు ఈ ఏడాది మొదటిలో మరణించిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే సభలో హీరోలు మహేష్ బాబు, సుదీర్ బాబు కృష్ణని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తమకి ఇంతగా అభిమానించే అభిమానులను ఇచ్చినందుకు ఆయనకి ఎప్పటికి రుణపడి ఉంటాం అంటూ వెల్లడించారు. కాగా ఈ సభకు హాజరయిన అభిమానుల కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు.

Mahesh Babu pic with his sisters gone viral

Mahesh Babu pic with his sisters gone viral