Ginna Movie: జిన్నా రిలీజ్‌పై విష్ణు క్లారిటీ.. ఎప్పుడు వస్తున్నాడంటే..?

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంపై మంచు విష్ణు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

Ginna Movie: జిన్నా రిలీజ్‌పై విష్ణు క్లారిటీ.. ఎప్పుడు వస్తున్నాడంటే..?

Manchu Vishnu Clarity On Ginna Movie Release

Ginna Movie: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర వర్గాల్లో అయోమయం నెలకొంది.

Manchu Vishnu Ginna Teaser: జిన్నా టీజర్.. మంచు విష్ణు డోస్ పెంచాడుగా!

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంపై మంచు విష్ణు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. జిన్నా సినిమాను పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించామని.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా అలరిస్తుందని ఆయన అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబర్ 5న కాకుండా, అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆయన సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లు నటంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సూర్య డైరెక్ట్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.