Manchu Vishnu Ginna Teaser: జిన్నా టీజర్.. మంచు విష్ణు డోస్ పెంచాడుగా!

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Manchu Vishnu Ginna Teaser: జిన్నా టీజర్.. మంచు విష్ణు డోస్ పెంచాడుగా!

Manchu Vishnu Ginna Teaser

Manchu Vishnu Ginna Teaser: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర మరోసారి ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. కాగా, ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Manchu Vishnu: జిన్నా టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్.. ఎప్పుడంటే?

జిన్నా టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్ర యూనిట్ కట్ చేశారు. ఈ సినిమాలో జిన్నా అనే పాత్రలో మంచు విష్ణు సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పట్టుకొస్తున్నాడు. ఊరి జనానికి బ్యాడ్ టైమ్ తీసుకొచ్చే వ్యక్తిగా జిన్నా పేరు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఉన్న సమస్యలను, ఎలా అధిగమిస్తాడు అనేది ఈ సినిమాలో హిలేరియస్‌గా చూపించబోతున్నారు. కాగా, ఈ సినిమాలో మరో అంశం కూడా ఉండబోతున్నట్లు ఈ టీజర్‌లో చూపించారు. హార్రర్ కామెడీతో ప్రేక్షకుల పొట్టచెక్కలు చేసేందుకు జిన్నా రాబోతున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలియజేశారు చిత్ర యూనిట్.

Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!

ఇక ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, టాలీవుడ్‌లోని మెజారిటీ కామెడీ స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు ప్రొడ్యూస్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అక్టోబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.