Manchu Vishnu: జిన్నా టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్.. ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు, ఆన్ లొకేషన్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది జిన్నా అండ్ టీమ్.

Manchu Vishnu Ginna Movie Teaser Release Date Locked
Manchu Vishnu: టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఈ సినిమాతో మంచు విష్ణు మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Manchu Vishnu: ప్రీలుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన జిన్నా..!
కాగా ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు, ఆన్ లొకేషన్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది జిన్నా అండ్ టీమ్. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
Manchu Vishnu : జిన్నా షూటింగ్ లో మంచు విష్ణుకి గాయాలు.. ఆ మాస్టర్ వల్లే అంటూ పోస్ట్..
ఈ సినిమాను దర్శకుడు సూర్య డైరెక్ట్ చేస్తుండగా, AVA ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Excited to show you #Ginna teaser on the 9th Sep. This is going to be crazy ? @starlingpayal @SunnyLeone pic.twitter.com/WbAFhgDLcF
— Vishnu Manchu (@iVishnuManchu) September 7, 2022