Chiranjeevi Tweet on Tarakarathna : తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ ట్వీట్..

నాలుగు రోజులుగా తారకరత్నకి చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు అంతా వెళ్లి తారకరత్నని చూసి, ఆయన చికిత్స గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని................

Chiranjeevi Tweet on Tarakarathna : తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ ట్వీట్..

Megastar chiranjeevi Tweet on Tarakarathna health

Updated On : January 31, 2023 / 10:57 AM IST

Chiranjeevi Tweet on Tarakarathna :  నటుడు నందమూరి తారకరత్న ఇటీవల నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రలో మొదటి రోజే తారకరత్న గుండెపోటు రావడంతో హఠాత్తుగా పడిపోయాడు. వెంటనే కార్యకర్తలు కుప్పం హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించాక బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తారకరత్నని తరలించారు.

నాలుగు రోజులుగా తారకరత్నకి చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు అంతా వెళ్లి తారకరత్నని చూసి, ఆయన చికిత్స గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని అంతా కోలుకుంటున్నారు.

Pathaan Collections : ఆరు రోజుల్లో 600 కోట్లు.. వీక్ డేస్ లో కూడా పఠాన్ వసూళ్లు తగ్గట్లేదుగా..

తాజాగా తారకరత్న ఆరోగ్యంపై, త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్ లో.. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఎక్కువ రోజు ఆరోగ్యంలో తారకరత్న ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై ట్వీట్ వేయడంతో ఇది వైరల్ గా మరింది.