Manasanamaha: గిన్నిస్ అవార్డ్ అందుకున్న తెలుగు షార్ట్ ఫిలిం డైరెక్టర్‌కి.. వీసా ఇబ్బందులు

క చిన్న షార్ట్‌ఫిలింగా వచ్చి గిన్నిస్ బుక్ అవార్డు సాధించిన లఘుచిత్రం మనసానమః. 2020 జనవరిలో విడుదలై ఏకంగా ఇప్పటివరకు 513 అవార్డులు అందుకుని ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్న లఘుచిత్రంగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్ లోకి ఎక్కింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంలో ఒకటి అయిన 'నార్త్ ఈస్ట్ ఫిలిం ఫెస్టివల్'లో స్క్రీనింగ్ కి క్వాలిఫై అయ్యింది. దీపక్ రెడ్డి వీసా సమస్యలతో ఆ స్క్రీనింగ్ కి వెళ్లలేకపోవడంతో తన ట్విట్టర్ ద్వారా సంబంధిత అధికారులకు ట్వీట్ చేస్తూ..

Manasanamaha: గిన్నిస్ అవార్డ్ అందుకున్న తెలుగు షార్ట్ ఫిలిం డైరెక్టర్‌కి.. వీసా ఇబ్బందులు

Oscar award winner Telugu Shortfilm Director facing Visa issues

Manasanamaha: ఒక చిన్న షార్ట్‌ఫిలింగా వచ్చి గిన్నిస్ బుక్ అవార్డు సాధించిన లఘుచిత్రం మనసానమః. 2020 జనవరిలో విడుదలై ఏకంగా ఇప్పటివరకు 513 అవార్డులు అందుకుని ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్న లఘుచిత్రంగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్ లోకి ఎక్కింది. ఈ షార్ట్ ఫిలిం చూసిన అడివి శేషు, సుకుమార్ లాంటి కొందరు సినిమా ప్రముఖులు కూడా డైరెక్టర్ దీపక్ రెడ్డిని అభినందిచారు. ఈ షార్ట్ ఫిలిం చూసిన తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తమిళ్ లో అనువదించి విడుదల చేశారు.

Mahesh Babu: కొడుకు పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేష్!

ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఈ సినిమా గతంలో ఆస్కార్ అవార్డు స్క్రీనింగ్ కూడా వెళ్ళింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ఇంకో అరుదైన ఘనత అందుకుంది. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంలో ఒకటి అయిన ‘నార్త్ ఈస్ట్ ఫిలిం ఫెస్టివల్’లో స్క్రీనింగ్ కి క్వాలిఫై అయ్యింది.అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ పురస్కారానికి డైరెక్టర్ వెళ్లలేకపోవడం.

దీపక్ రెడ్డి వీసా సమస్యలతో ఆ స్క్రీనింగ్ కి వెళ్లలేకపోవడంతో తన ట్విట్టర్ ద్వారా సంబంధిత అధికారులకు ట్వీట్ చేస్తూ..”నేను చారిత్రాత్మక నార్త్ ఈస్ట్ ఫిలిం ఫెస్టివల్ లో నా మొదటి రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాజరు కావాలనుకుంటున్నాను, కానీ భారతదేశం నుండి వీసా పరిమితుల కారణంగా రాలేకపోతున్నాను. మీ సహాయం మరియు మద్దతు కోసం అభ్యర్థిస్తున్నాను” అంటూ తెలిపాడు. అతన్ని సపోర్ట్ చేస్తూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.