Mahesh Babu: కొడుకు పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేష్!

మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా అతడికి శుభకాంక్షలు తెలిపారు. 'నా యంగ్‌ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నువ్వు నన్ను గర్వపడేలా చేస్తున్నావు. అలానే నువ్వు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే సమయం కోసం నేను ఎదురు చూస్తున్నా’ అంటూ మహేష్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

Mahesh Babu: కొడుకు పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేష్!

Mahesh Convey his wishes to his Son Gautam..

Updated On : August 31, 2022 / 2:26 PM IST

Mahesh : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో మనందరికీ తెలిసిందే. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం ఫ్యామిలీకి కేటాయించడం మహేష్ కి అలవాటు. అలానే సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుని ఫామిలీ కోసం ఒక హాలిడే ట్రిప్ కి వెళ్ళడం మహేష్ కి అలవాటు. ఇటీవలే ఫామిలీతో పారిస్ వెళ్లి వచ్చిన మహేష్ అక్కడ ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకొన్నారు.

Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

అయితే ఈ రోజు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా శుభకాంక్షలు తెలిపారు..’నా యంగ్‌ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నువ్వు నన్ను గర్వపడేలా చేస్తున్నావు. అలానే నువ్వు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే సమయం కోసం నేను ఎదురు చూస్తున్న. నువ్వు వేసే ప్రతి అడుగులో నా ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు తోడుంటాయి గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమయినా నేను నీ వెన్నంటే ఉంటా. లవ్‌ యూ మై సన్‌, నువ్వు ఊహించలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

Mahesh Babu : మహేష్ బాబు.. షర్ట్ లేకుండా మొదటిసారి.. స్విమ్మింగ్ ఫూల్ లో..

ఇది ఇలా ఉండగా మహేష్ తన తదుపరి సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రతిష్ఠాతంకంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా మహేష్ సరసన రెండోసారి మెరవనుండగా థమన్ బాణీలు అందిస్తున్నాడు.