Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ

పవన్ అభిమానుల సెగ రాష్ట్ర మంత్రులకి సోకింది. ఇవాళ గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఏపీ రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్.....

Bheemla Nayak : పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ అభిమానుల సెగ

Perni Nani

Pawan Kalyan :  ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ అవుతుంది. తెలంగాణలో సినీ పరిశ్రమని సపోర్ట్ చేస్తూ అయిదవ షో పర్మిషన్లు ఇచ్చారు. బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి మారలేదు. ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

దీంతో నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. సినిమాల పట్ల, పవన్ పట్ల ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోంది అంటూ ఆందోళనలు చేపట్టారు. థియేటర్ల బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు పవన్ ఫ్యాన్స్. నిన్న రాత్రి నుంచే ఏపీలో పలు థియేటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాశారు పవన్ అభిమానులు. అయినా షోలు వేయకపోవడంతో పవన్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ కి, రానాకి సెలబ్రిటీల విషెస్..

పవన్ అభిమానుల సెగ రాష్ట్ర మంత్రులకి సోకింది. ఇవాళ గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఏపీ రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు పవన్ అభిమానుల నిరసన సెగ తగిలింది. థియేటర్ వద్ద మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. సినిమాల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని తమ వ్యతిరేకతని తెలిపారు.

Pawan Kalyan : ఏపీలో పలుచోట్ల ‘భీమ్లా నాయక్’ సెకండ్ షో రద్దు.. దాని బదులు..

గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గం అని జనసేన నాయకులు అన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని జనసేన పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.