Kalki – Chiranjeevi : ప్రభాస్ ‘కల్కి’ ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేస్తూ.. చిరుకి బర్త్ డే విషెస్..

మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ అంటే ఓ రేంజ్ ఉండాలని ఫిల్ అయ్యారో ఏంటో? కల్కి మేకర్స్ ఏకంగా ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేస్తూ..

Kalki – Chiranjeevi : ప్రభాస్ ‘కల్కి’ ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేస్తూ.. చిరుకి బర్త్ డే విషెస్..

Prabhas Kalki 2898 AD makers wish chiranjeevi by leak video from editing room

Updated On : August 22, 2023 / 6:52 PM IST

Kalki 2898 AD – Chiranjeevi : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రొడక్షన్ విషయంలో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమా సెట్స్ నుంచి ఎటువంటి లీక్స్ కూడా జరగకుండా జాగ్రత్త పడుతుంది. కానీ మేకర్సే తాజాగా డైరెక్ట్ ఎడిటింగ్ రూమ్ నుంచి వీడియో లీక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ అంటే ఓ రేంజ్ ఉండాలని ఫిల్ అయ్యారో ఏంటో గాని.. మూవీలోని ఒక క్లిప్ ని లీక్ చేశారు.

Vijay Deverakonda : తమిళ్ దర్శకుడితో సినిమా కన్‌ఫార్మ్ చేసిన విజయ్ దేవరకొండ..

కల్కి ఎడిటింగ్ రూమ్ నుంచి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. ఎడిటింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు నిర్మాతలు. దానిలో ప్రభాస్ ఏదో గ్యాడ్జెట్ ని రెడీ చేస్తున్నాడు. ఈక్రమంలోనే వెల్డింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీనికి చిరు గ్యాంగ్ లీడర్ మ్యూజిక్ పెట్టి.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ పోస్టర్ ని ప్రభాస్ రీ క్రియేట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఆ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Vijay Deverakonda : రజిని జైలర్ హిట్ అయ్యి.. భోళాశంకర్ ప్లాప్ అయితే.. చిరంజీవి స్థాయి తగ్గిపోదు..

ఇక కల్కి విషయానికి వస్తే.. ఈ సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ (Amitabh Bachchan), దిశా పటాని (Disha Patani) వంటి స్టార్స్ నటిస్తున్నారని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే వీరితోపాటు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ మరికొంతమంది స్టార్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని ప్రకటించినప్పటికీ.. ఆ సమయానికి రావడం కష్టమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.