Alphonse Puthren : సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై.. కారణం ఏంటంటే..?
మూవీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అంటే కొంచెం కొత్తగానే ఉంటుంది. కానీ ప్రేమమ్ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

Premam movie director Alphonse Puthren announce his retirement from movies
Alphonse Puthren : మలయాళ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ ప్రకటించాడు. అల్ఫోన్స్ పుత్రెన్ అంటే తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు గాని ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అంటే కచ్చితంగా తెలుస్తుంది. ఈ జనరేషన్ తెలుగు ఆడియన్స్ కి మలయాళ సినిమాల పై ఆసక్తి కలిగింది అంటే.. అది ప్రేమమ్ సినిమా వలనే. 2015లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి ఇద్దరి టాలెంటెడ్ యాక్ట్రెస్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చిత్రీకరించి దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న అల్ఫోన్స్.. 2013లో ‘నేరమ్’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. రెండో సినిమా ‘ప్రేమమ్’తో స్టార్ డైరెక్టర్ హోదాని అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత అవియల్, గోల్డ్, గిఫ్ట్.. చిత్రాలను అందుకున్నాడు. దర్శకుడిగా ఐదు సినిమాలే తెరకెక్కించిన అల్ఫోన్స్.. సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. మూవీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అంటే కొంచెం కొంతగానే ఉంటుంది. ఎందుకంటే, సినీ పరిశ్రమలో ఫేమ్ తగ్గినా.. ఏదో పని చేస్తూ ఇండస్ట్రీలోనే ఉంటుంటారు.
Also read : Maestro : మ్యూజికల్ బయోపిక్.. ఇళయరాజాగా ధనుష్ కొత్త సినిమా..!
ఇంతకీ అసలు అల్ఫోన్స్ రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణం ఏంటంటే.. ఈ దర్శకుడు కొంత కాలంగా ‘అటిజం స్పెక్ర్టమ్’ అనే అరుదైన డిజార్డర్ తో బాధపడుతున్నాడట. ఈ సమస్యతో తను మరొకరికి భారం కాకూడదని నిర్ణయించుకొని వెండితెరకు రిటైర్మెంట్ పలికినట్లు వెల్లడించాడు. సినిమాలు చేయకున్నా షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఓటీటీ అవకాశం వచ్చినా చేస్తాను అంటూ వెల్లడించాడు. ఈ రిటైర్మెంట్ ప్రకటిస్తూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసి దానిని కొద్దిసేపటికే డిలీట్ చేశాడు.