Samantha : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత | Samantha ok to another series in Bollywood

Samantha : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత

'ఫ్యామిలీమ్యాన్ 2' వెబ్ సిరీస్ తో వచ్చిన ఇమేజ్ ఇప్పుడు సమంతకి బాలీవుడ్ లో బాగా ఉపయోగపడుతుంది. తాజాగా ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లతో మరో......

Samantha : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత

Samantha :   సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీమ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో తన నటనతో బాలీవుడ్ లో కూడా అభిమానులని సంపాదించుకుంది. ఈ సిరీస్ తో పేరుతో పాటు చాలా అవార్డులు కూడా సంపాదించింది సమంత. ఇప్పటికే సమంత చేతిలో నాలుగు సౌత్ సినిమాలు ఉన్నాయి. ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

‘ఫ్యామిలీమ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో వచ్చిన ఇమేజ్ ఇప్పుడు సమంతకి బాలీవుడ్ లో బాగా ఉపయోగపడుతుంది. తాజాగా ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లతో మరో సిరీస్ కి ఓకే చెప్పింది. రాజ్ అండ్ డీకే ఇప్పటికే తమ నెక్స్ట్ సిరీస్ కథని సమంతకి వినిపించగా సమంత ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో సమంత మరో సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Dimple hayathi : రవితేజ ‘ఖిలాడీ’ భామ డింపుల్ హయాతికి కరోనా

అంతేకాక బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కూడా సమంతతో సినిమాలు చేయడానికి ట్రై చేస్తుందని తెలుస్తుంది. సమంతతో ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు ఫలిస్తే ఒకేసారి బాలీవుడ్ లో యశ్ ఫిలిమ్స్ నిర్మాణంలో మూడు సినిమాల కాంట్రాక్టుకి ఓకే చేసే అవకాశం ఉంది సమంత.

×