సమస్య ఏదైనా చర్చకు సిద్ధం.. ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

ప్రియాంక విమర్శల దాడి పెంచడంతో బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.

సమస్య ఏదైనా చర్చకు సిద్ధం.. ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్

Smriti Irani Dares Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల వేళ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ, బీజేపీ నేతలంతా సమస్యలను గాలికి వదిలి.. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అగ్రనేతల ఆరోపణలకు.. బీజేపీ కూడా కౌంటర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

బీజేపీ నేతలు ధర్మం పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప అభివృద్ధిని పట్టించుకోరని విమర్శించారు ప్రియాంక. దేవుళ్ల మీద ఒట్లు వేయించి ఓట్లు రాబట్టుకోవడం తప్ప.. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలకు శ్రద్ద లేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ చిత్తశుద్ధి ఉంటేనే అభివృద్ధి జరగడంతో పాటు, ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు ప్రియాంక.

బీజేపీ నేతలు ఎంత సేపు సమస్యలను పక్కకు పెట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రియాంక. నిరుద్యోగం, పేదరికం, మహిళలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసలైన సమస్యలను గాలికి వదిలేసి..పనికి మాలిన ఇష్యూస్‌పైనే దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు ప్రియాంక.

ప్రియాంక విమర్శల దాడి పెంచడంతో బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. ఏ టీవీ ఛానల్ అయినా.. ఏ యాంకర్ సమక్షంలోనైనా.. అంశమేదైనా ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు.

Also Read: కొంపముంచిన జాత్యహంకార వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా రాజీనామా

అమేథీ నుంచి స్మృతి ఇరానీ మరోసారి బరిలోకి దిగారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సోదరుడి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న ప్రియాంక.. రాయ్‌బరేలీని చుట్టేస్తున్నారు. ఇందిరాగాంధీ ఉండగా ప్రజలకు దగ్గరగా ఉండేవారని.. మోదీ కార్పోరేట్లకు అందుబాటులో ఉంటున్నారని విమర్శిస్తున్నారు ప్రియాంక.