Cm Revanth Reddy : ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలి- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సూచించారు.

Cm Revanth Reddy : ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలి- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy : ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించడం అతి పెద్ద బాధ్యత అని 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సీఎం కావాలని అనుకున్నా అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పినట్లుగా ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో మంచి పనులు చేస్తుంటే.. ప్రశంసించకుండా విమర్శలు చేస్తారా? అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్.

కేసీఆర్ తమకు మంచి సూచనలు చేస్తే ఎప్పుడూ ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం పడిపోతుందని పనిగట్టుకుని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును విపక్షాలు గౌరవించాలని సీఎం రేవంత్ సూచించారు. కానీ, కేసీఆర్ అధికారం కోసం చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించాలని సీఎం రేవంత్ హితవు పలికారు. అంతేకాదు కేసీఆర్ లో మార్పు రావాలని చెప్పారు. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం అని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

”పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేసి తీరుతా. మాజీ మంత్రి హరీశ్ రావు ముందు మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండాలి. రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలి. లేదు నేను, మా మామ ఇలానే మాట్లాడతాం, అబద్దాలు చెబుతాం అంటే.. తెలంగాణ సమాజమే నిర్ణయిస్తుంది వాళ్ల విధానం ఏమిటన్నది?” అని సీఎం రేవంత్ అన్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదే..!- సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

 

పూర్తి వివరాలు..