Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.

Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Cm Revanth Reddy : లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరగనుంది? 150 రోజుల కాంగ్రెస్ పాలనలో జరిగిందేంటి? జరగాల్సిందేంటి? ఆగస్టు 15 నాటికి గ్యారెంటీలన్నీ అమలవుతాయా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఒక సీటు ఎక్కువ వస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ చెబుతున్నట్లు రాష్ట్రంలో ఏమైనా పరిణామాలు మారే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని పడగొట్టే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

”తెలంగాణలో ఏం జరగాలన్నా బీఆర్ఎస్, బీజేపీ కలవాలి. బీఆర్ఎస్, బీజేపీ కలవకుండా ఇవేమీ జరగవు. బీజేపీతో కలుస్తామని కేసీఆర్ బహిరంగంగా చెప్పగలరా? అలా చెబితే ఆయన పార్టీలో ఆ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో కేసీఆర్ కు అర్థమవుతుంది. ఆయన కలవలేదు అంటే ఈ చర్చనే లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే పాత్ర పోషించాలని బీఆర్ఎస్ అనుకున్నప్పుడే.. ఈ చర్చ వస్తుంది. అదే ఆలోచన చేస్తే.. బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదా? అల్లుడు ఏ పార్టీలోకి పోతాడు? కొడుకు ఏ దేశానికి వెళ్తాడు? కేసీఆర్ ఎక్కడుంటారు? ఇవన్నీ చర్చించాల్సిన విషయాలే. రాజకీయాల్లో వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది. ఆఖరి నిమిషంలో సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయి. మా ప్రభుత్వాన్ని నిజంగానే పడగొట్టాలనే తాపత్రయంతో కేసీఆర్ వస్తే.. దాన్ని నేను రీతిలో ఎదుర్కొంటా. అంతకుమించి నాకు మరో ప్రత్యామ్నాయం లేదు కదా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు బీజేపీ చేసింది. బీజేపీ ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉంది. కేంద్రం పట్ల ఒక రాష్ట్ర సీఎంగా ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. పార్టీ నాయకుడిగా ఎలా నడుచుకోవాలో కూడా నాకు తెలుసు” అని సీఎం రేవంత్ అన్నారు.

Also Read : అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం- 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి

పూర్తి వివరాలు..