Adipurush : ఆదిపురుష్ వివాదం మరింత ముదురుతోంది.. సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే..

ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అని హిందూ సంఘాలు, హిందూ సాధువులు, హిందువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డ్‌’ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్...................

Adipurush : ఆదిపురుష్ వివాదం మరింత ముదురుతోంది.. సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే..

Sanathan sensor Board should be formed demand by Hindus regarding adipurush issue

Adipurush : ఇటీవల రిలీజైన ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ విమర్శలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రామాయణం ఆధారంగా తీస్తానని చెప్పి టీజర్ లో పాత్రలు మాత్రం రామాయణ పాత్రలుగా అనిపించలేదు. రావణాసురుడు పాత్ర ముస్లిం రాజుగా, హనుమంతుడి పాత్ర కింగ్ కాంగ్ గా ఉండటం, రాముడ్ని కూడా సరిగ్గా చూపించకపోవడంపై దేశమంతటా వివాదం చెలరేగుతుంది. ఇప్పటికే హిందువులు, పలు ప్రముఖులు ఈ టీజర్ ని, దర్శకుడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఏకంగా ఆదిపురుష్ సినిమాకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా పంపించిందంటే ఈ వివాదం ఎంత ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో ఇలా జరగడం మొదటి సారి కాదు. ప్రతి సారి బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవుళ్ళని కించపరిచేలా సినిమాలు తీస్తున్నారు. ప్రతిసారి విమర్శలు ఎదురవుతున్నా వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు. దీంతో చాలామంది హిందువులు, హిందూ సాధువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డు’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అని హిందూ సంఘాలు, హిందూ సాధువులు, హిందువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డ్‌’ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్.. పలు రాష్ట్రాల్లో హిందువులు గట్టిగానే పోరాడుతున్నారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ డిమాండ్ కి మద్దతిస్తున్నారు.

Actor Kasthuri Shankar: నయన్ దంపతులు చేసిన పని చట్టరీత్యా నేరం.. నటి కస్తూరి!

తాజాగా రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ ఈ డిమాండ్ కి మద్దతిస్తూ సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు కోసం హిందూ సాధువులు చేస్తున్న డిమాండ్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. సాధువులకు అండగా నిలిచి వారి డిమాండ్‌లను పరిశీలించి అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థిస్తాను అన్నారు. సనాతన్ సెన్సార్ బోర్డ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. నార్త్ లో ఈ వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది.