Bollywood : బాలీవుడ్‌కి నో చెప్తున్న హీరోలు..

 ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటించడం సౌత్ హీరోలకు పెద్ద డ్రీమ్. కట్ చేస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏకంగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ నే షేక్ చేస్తున్న సౌత్ హీరోలకు ఇప్పుడు..............

Bollywood : బాలీవుడ్‌కి నో చెప్తున్న హీరోలు..

some heros say no to Bollywood offers

Bollywood :  ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటించడం సౌత్ హీరోలకు పెద్ద డ్రీమ్. కట్ చేస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏకంగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ స్ర్కీన్ నే షేక్ చేస్తున్న సౌత్ హీరోలకు ఇప్పుడు బాలీవుడ్ నథింగ్. అందుకే తాము బాలీవుడ్ సినిమాలు చేయమని ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు కొంతమంది హీరోలు.

కొంతకాలంగా హిందీ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేక పోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన చిత్రాలు సైతం మినిమమ్ ఓపెనింగ్స్ తెచ్చుకోలేక పోతున్నాయి. దీనికి తోడు పాన్ ఇండియా సినిమాలతో సౌత్ హీరోలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై అటాక్ చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం సక్సెస్ కోసం సౌత్ హీరోలు, మేకర్స్ తో బాలీవుడ్ చేతులు కలపక తప్పడం లేదు. అందుకే కొందరు సౌత్ హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీని లైట్ తీసుకుంటున్నారు. అక్కడ సినిమాలు చేయమని ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

రీసెంట్ గా ఇండియన్ బాక్సాఫీస్ పై భారీ కలెక్షన్స్ తో విరుచుకుపడిన కన్నడ సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తనే హీరోగా నటించిన ఈ సినిమా కన్నడ కల్చర్ పై, డివోషనల్ యాస్పెక్ట్స్ పై అద్బుతంగా తెరకెక్కింది. అన్ని సౌత్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో సైతం దుమ్మురేపేసింది. రీసెంట్ గా రిషబ్ శెట్టి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కన్నడ వాడిని అయినందుకు గర్వపడుతున్నానని, అందుకే తాను కన్నడ సినిమాలే చేయాలని డిసైడయ్యానని, నన్ను ఈ పొజీషన్ కు తెచ్చింది కన్నడ పరిశ్రమేనని అని కుండబద్దలు కొట్టాడు. ప్రేక్షకులను, వారి సెంటిమెంట్లను మైండ్‌లో పెట్టకుని సినిమా తీయాలి. వారి విలువలు, వారి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టకోవాలి. ఇది లేకనే బాలీవుడ్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని క్లారిటీ ఇచ్చాడు రిషబ్ శెట్టి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ పై గతంలో చాలా సార్లు డిస్కషన్స్ జరిగాయి. అయితే ఎప్పటికప్పుడు అతడు క్లారిటీ ఇస్తునే ఉన్నాడు. రీసెంట్ గా ‘మేజర్’ సినిమా రిలీజ్ సమయంలో కూడా మహేశ్ మరోసారి ఆ అంశంపై రియాక్ట్ అయ్యాడు. తెలుగు సినిమాలకు ఇండియా వైడ్ గా లభిస్తున్న క్రేజ్​పై హ్యాపీగా ఫీలయ్యాడు సూపర్​స్టార్​. తాను ప్రత్యేకంగా బాలీవుడ్​లో​ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడు. ‘నేరుగా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా?’ అని ఓ విలేకరి అడిగిన దానికి ప్రిన్స్​ స్పందిస్తూ.. “నేరుగా హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆదరిస్తున్నారు.” అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

‘పుష్ప’ సినిమాతో రీసెంట్ గా నేషనల్ వైడ్ గా పాపులరయిన అల్లు అర్జున్ తన బాలీవుడ్ ఎంట్రీ పై షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ‘హిందీలో యాక్ట్ చేయడమంటే నా కంఫర్ట్ జోన్‌ నుంచి కాస్త పక్కకు జరగడమే. అయినా అవసరమనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను’ అని క్లారిటీ ఇచ్చాడు బన్నీ. అల్లు అర్జున్‌ స్టైల్‌కీ, డ్యాన్స్ కీ ఎప్పటి నుంచో నార్త్ లో మంచి ఫాలోయింగ్‌ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లే యూట్యూబ్‌ రికార్డులు కొల్లగొడుతుంటాయి. రీసెంట్‌గా పుష్ప సినిమా నార్త్ బెల్ట్ లో కలెక్ట్ చేసిన వసూళ్లు కూడా ఆయన స్టామినాను మరో సారి ప్రూవ్‌ చేశాయి. ఇప్పుడు పుష్ప2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్‌ మొత్తం వెయిటింగ్‌. ఇలాంటి సమయంలో బన్నీ చెప్పిన మాటలు ముంబై సర్కిల్స్ లో వైరల్ అయ్యాయి.

Trivikram : హిట్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా?.. అసలు ఇద్దరికీ సెట్ అవుతుందా??

మాలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్స్ లో యంగ్ హీరో నివీన్ పాలీ ఒకడు. అన్ని జానర్స్ లోనూ సినిమాలు చేసి మెప్పించిన ఈ హీరో కూడా ఎక్కువగా మాలీవుడ్ సినిమాలకే పరిమితమవ్వాలనుకుంటాడు. మలయాళ ఆడియస్స్, మలయాళ కల్చరే తనకు చాలనుకుంటాడు. అలాంటి ఈ హీరోతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ కశ్యప్ ఓ డార్క్ థ్రిల్లర్ తీయాలని తెగ ట్రై చేశాడు. అయితే నివీన్ కు మలయాళ సినిమాలతోనే టైమంతా సరిపోవడంతో సినిమాకి నో చెప్పాడు. అంతేకాదు ఫ్యూచర్ లో కూడా తాను బాలీవుడ్ సినిమాల్లో నటించనని క్లారిటీ కూడా ఇచ్చాడు. దాంతో అందరూ షాకయ్యారు.

ఇలా ఇప్పుడున్న కొంతమంది హీరోలు తమ భాషల్లోనే సినిమాలు చేసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించాలనుకుంటున్నారు తప్ప, పేరు కోసం బాలీవుడ్ లో సినిమాలు తీయాలనుకోవట్లేదు. ఇది కూడా ఒకందుకు మంచి పరిణామమే అనుకోవచ్చు. లోకల్ సినిమాలు అప్పుడు దేశవ్యాప్తంగా మరింత రీచ్ ని తెచ్చుకుంటాయి.