Sonam Kapoor : పండంటి బాబుకి జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్..

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి........

Sonam Kapoor : పండంటి బాబుకి జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్..

sonam kapoor gave birth to a boy child

Sonam Kapoor :  బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసింది సోనమ్. లండన్‌లో సీమంతం కూడా జరుపుకోగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా సోనమ్ కపూర్ పండంటి బాబుకి జన్మనిచ్చినట్టు ప్రకటించింది.

Vijay Devarakonda : మేం సినిమాలు చేయొద్దా.. ఇంట్లో కూర్చోవాలా..? మా సినిమాని బాయ్ కాట్ చేస్తారా.. బాయ్‌కాట్‌ లైగర్ పై విజయ్ స్పందన..

ఈ మేరకు తన సోషల్ మీడియాలో.. ”ఆగస్టు 20, 2022.. మా బాబు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. డాక్టర్స్, నర్సులు, కుటుంబసభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రారంభం మాత్రమే, మా బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు. ఇట్లు మీ సోనమ్‌-ఆనంద్‌” అని పోస్ట్ చేసింది సోనమ్ కపూర్. దీంతో నెటిజన్లు, అభిమానులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనమ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.