Vijay Devarakonda : మేం సినిమాలు చేయొద్దా.. ఇంట్లో కూర్చోవాలా..? మా సినిమాని బాయ్ కాట్ చేస్తారా.. బాయ్‌కాట్‌ లైగర్ పై విజయ్ స్పందన..

విజయ్ దేవరకొండ బాయ్ కాట్ లైగర్ పై మాట్లాడుతూ.. ''అసలు వీళ్ళకి ఏం కావాల్నో నాకు అర్ధం కావడం లేదు. మేము సినిమాలు చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలా. నేను ఇండియాలోనే................

Vijay Devarakonda : మేం సినిమాలు చేయొద్దా.. ఇంట్లో కూర్చోవాలా..? మా సినిమాని బాయ్ కాట్ చేస్తారా.. బాయ్‌కాట్‌ లైగర్ పై విజయ్ స్పందన..

vijay devarakonda

Vijay Devarakonda :  ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ లిస్ట్ లోకి లైగర్ సినిమా కూడా చేర్చేసారు. బాలీవుడ్ ని భయపెడుతున్న ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇప్పడు ‘లైగర్‌’ సినిమాను కూడా భయపెడుతుంది. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావడంతో కొన్ని రోజుల నుంచి దేశమంతటా సినిమా ప్రమోషన్స్ ని పీక్స్ లో చేస్తున్నారు. రిలీజ్ డేట్‌ దగ్గరపడుతున్న సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది.

దీనికి కారణం లైగర్ సినిమా కూడా బాలీవుడ్ సినిమా అని అంతా అనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ తప్పితే మిగిలిన వాళ్ళు బాలీవుడ్ అవ్వడం నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని ప్రెజెంట్ చేయడం, ఇది హిందీ సినిమా అని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని టాక్ రావడం, సినిమా మొత్తం ముంబైలోనే తెరకెక్కించడం, పాటల్లో బాలీవుడ్ ఫ్లేవర్ కనిపించడం.. ఇవన్నీ చూసి ఈ సినిమా కూడా బాలీవుడ్ సినిమా అనుకోని బాయ్ కాట్ చేస్తున్నారు.

#BoycottLiger : ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్‌ లైగర్.. లైగర్ టాలీవుడ్ సినిమా కాదా??

తాజాగా బాయ్ కాట్ లైగర్ పై విజయ్ శనివారం విజయవాడలో జరిగిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో స్పందించాడు. విజయ్ దేవరకొండ బాయ్ కాట్ లైగర్ పై మాట్లాడుతూ.. ”అసలు వీళ్ళకి ఏం కావాల్నో నాకు అర్ధం కావడం లేదు. మేము సినిమాలు చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలా. నేను ఇండియాలోనే పుట్టాను. నార్త్ లో ఎక్కువ రీచ్ రావడానికే కరణ్ సర్ తో కలిశాము. కరణ్ సర్ ఉన్నారు కాబట్టే నార్త్ లో కూడా ఇంత బాగా ప్రమోషన్ అవుతుంది. అయినా మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుదాం. కథలో ఒక తల్లి, ఒక అబ్బాయి ముంబైకి వెళ్లి ఛాంపియన్ అవ్వాలని కలలు కంటారు. ఇలాంటి సినిమాని బాయ్ కాట్ చేస్తారా. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. టికెట్స్ అన్ని ఐపోతున్నాయి” అని అన్నారు.