Peddha Kapu 1 : ఓ సామాన్యుడి సంతకం.. పెదకాపు.. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా!

శ్రీకాంత్ అడ్డాల తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూనే సంచలనం సృష్టిస్తున్నాడు. ఒక సామజిక వర్గానికి చెందిన పేరు అయిన 'పెద్దకపు' అనే టైటిల్‌తో..

Peddha Kapu 1 : ఓ సామాన్యుడి సంతకం.. పెదకాపు.. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా!

Srikanth Addala new movie Peddha Kapu 1 motion poster released

Srikanth Addala – Peddha Kapu 1 : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. కొత్త బంగారులోకం సినిమాతో ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా తరువాత రెండో సినిమాని వెంకటేష్ (Venkatesh), మహేష్ బాబు (Mahesh Babu) తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అంటూ మల్టీస్టారర్ చిత్రం తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో శ్రీకాంత్ అడ్డాల పేరు మారుమోగిపోయింది. అయితే మహేష్ తో తీసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఈ దర్శకుడి కెరీర్ ని బాగా దెబ్బ తీసింది.

Pawan Kalyan : వారాహి షెడ్యూల్ రిలీజ్ చేసిన పవన్.. మరి మూవీ షెడ్యూల్స్ సంగతి ఏంటి?

దీంతో ఆ సినిమా వచ్చిన 5 ఏళ్ళ తరువాత ‘నారప్ప’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే ఎంటర్టైన్ చేసిన శ్రీకాంత్ అడ్డాల.. నారప్పతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కి రీమేక్ గా వచ్చింది. ఇక ఇప్పుడు కూడా అడ్డాల.. మళ్ళీ అలాంటి ఒక మాస్ స్టోరీతో రాబోతున్నాడని తెలుస్తుంది. నేడు తన కొత్త మూవీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి టైటిల్ తోనే సంచలనం సృష్టిస్తున్నాడు.

Sharwanand : శర్వానంద్ పెళ్లి శుభలేఖ చూశారా.. పెళ్ళికొడుకుని చేసే టైం, పెళ్లి టైం ఎప్పుడంటే!

ఒక సామజిక వర్గానికి చెందిన పేరు అయిన ‘పెద్దకపు’ అనే టైటిల్ ని ఖరారు చేసి బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఇక ఈ టైటిల్ కి ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. చూస్తుంటే పొలిటికల్ డ్రామా మూవీ అని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాని పలు భాగాలుగా రాబోతుంది. ఇక ఈ సినిమాతో కొత్త కుర్రాడు ‘విరాట్ కర్ణ’ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. అఖండ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.