Salaar : సలార్ సెట్‌లో బర్త్ డే సెలెబ్రేషన్స్.. శరవేగంగా సలార్ షూటింగ్.. ఫ్యాన్స్ ఖుషి..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, శాండిల్‍వుడ్ రెబల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. అయితే ఈమధ్య కాలంలో సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో.. అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అని ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా సెట్ లో..

Salaar : సలార్ సెట్‌లో బర్త్ డే సెలెబ్రేషన్స్.. శరవేగంగా సలార్ షూటింగ్.. ఫ్యాన్స్ ఖుషి..

Sriya reddy Birthday Celebrations in Salaar Set

Salaar : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, శాండిల్‍వుడ్ రెబల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ చిత్రాలతో మాస్ పల్స్ కి బాగా కనెక్ట్ అయ్యిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తరువాత సరైన హిట్టు లేకపోవడంతో, అభిమానుల ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

Salaar: సలార్ సినిమాలో క్రేజీ స్టార్.. నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే!

అయితే ఈమధ్య కాలంలో సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో.. అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అని ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా సెట్ లో జరిగిన బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫొటోస్ బయటకి రావడంతో, షూటింగ్ జరుగుతుందని అర్ధమవుతుంది. తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘శ్రీయ రెడ్డి’.

శ్రీయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. కాగా ఈ అమ్మడి పుట్టినరోజు వేడుకలను సలార్ సెట్ లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇందుకు సంబందించిన కేక్ ఫోటోను శ్రీయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. దీంతో సలార్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని అర్ధమవుతుంది. కాగా ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.