Tamannaah in Jailer Movie : రజినీకాంత్ సరసన తమన్నా.. ‘జైలర్’లో హీరోయిన్ గా మిల్కీబ్యూటీ?

లేటెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పక్కన నటించేందుకు గోల్గెన్ ఛాన్స్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ. అన్ని సినీ పరిశ్రమలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా తాజాగా రజనీకాంత్ సరసన, నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ సినిమాలో.........

Tamannaah in Jailer Movie : రజినీకాంత్ సరసన తమన్నా.. ‘జైలర్’లో హీరోయిన్ గా మిల్కీబ్యూటీ?

tamannaah gets chance in Rajinikanth Movie

Updated On : August 14, 2022 / 1:42 PM IST

Tamannaah in Jailer Movie :  మిల్కీబ్యూటీ తమన్నాకు సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసొస్తుంది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు సూపర్ స్టార్స్ పక్కన క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తుంది తమన్నా. పెద్ద పెద్ద హీరోలకి బెస్ట్ ఆప్షన్ అవుతోంది. లేటెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ పక్కన నటించేందుకు గోల్గెన్ ఛాన్స్ కొట్టేసింది మిల్కీ బ్యూటీ. అన్ని సినీ పరిశ్రమలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా తాజాగా రజనీకాంత్ సరసన, నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.

Google Surprise to RRR : RRR కోసం గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌.. గూగుల్ లో RRR అని వెతికి చూడండి..

ఇప్పటికే టైటిల్ ప్రీ లుక్ తో అదరగొట్టిన జైలర్ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. విజయ్ బీస్ట్ ఫ్లాప్ తర్వాత కూడా నెల్సన్ దిలీప్ కుమార్ ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చారు రజనీకాంత్. మరి ఆయన నమ్మకాన్ని దిలీప్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది. తాజాగా మిల్కీ బ్యూటి తమన్నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ రజనీకాంత్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందనే అనే వార్త తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది.